అక్కడంతా సర్వనాశనం... గుబులుపుట్టిస్తున్న శాటిలైట్‌ చిత్రాలు? | New Satellite Pics Show Heavy Damage Of War Turn Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో అక్కడంతా సర్వనాశనం.. గుబులుపుట్టిస్తున్న శాటిలైట్‌ చిత్రాలు

Mar 3 2022 10:16 PM | Updated on Mar 3 2022 11:34 PM

New Satellite Pics Show Heavy Damage Of War Turn Ukraine - Sakshi

రివ్‌నోపిలియా పట్టణంలోని వందలాది ఇళ్లు కాలిపోతున్న దృశ్యాలు (Image credit: AFP/ Satellite Image ©2022 Maxar Technologies)

కీవ్‌: ఉక్రెయిన్‌ రష్యా యుద్ధంతో కళ్ల ముందు విధ్వంసం తప్ప మరేమీ కనిపించడం లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్, రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్ శిథిలాల దిబ్బగా మారిపోయాయి. ఆకాశ హార్మ్యాలు నేలమట్టమయ్యాయి. వీధుల్లో స్మశాన నిశబ్దం అలుముకుంది. లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బంకర్లతో కాలం గడుపుతున్నారు.బాంబుల ధాటికి కాలి మసిబారి రూపు కోల్పోయిన భవనాలు, కూలిన వంతెనలు, దెబ్బతిన్న రహదారులే కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ దుర్బర పరిస్థితిని కళ్లకు కట్టే శాటిలైట్‌ చిత్రాలు బయటకొచ్చాయి.

పశ్చిమ కీవ్‌లోని బుచ ప్రాంతం.. వోక్‌జల్నా వీధిలో ఇళ్లు, మిలటరీ వాహనాలు కాలిపోతున్న దృశ్యాలు
( Courtesy: Maxar Technologies)

చెర్నివ్‌లో బాంబుల దాడిలో ధ్వంసమైన బ్రిడ్జి.. ఇళ్లు.
( Courtesy: Maxar Technologies)

చెర్నివ్‌ శివారులోని ఓ ఫ్యాక్టరీ బాంబుల దాడిలో నాశమైన దృశ్యాలు.
( Courtesy: Maxar Technologies)

లుజంకా వద్ద ఉక్రెయిన్‌-హంగేరి సరిహద్దు దాటుతున్న కార్లు
( Courtesy: Maxar Technologies)

చెర్నివ్‌వైపునకు వెళ్తున్న రష్యా మిలటరీ వాహనశ్రేణి
( Courtesy: Maxar Technologies)

కీవ్‌లో ఆహారం కోసం కీలోమీటర్లకొద్దీ క్యూలైన్లలో జనం
(Courtesy: Maxar Technologies)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement