గిన్నీస్ రికార్డ్‌: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి..

Nepal Man Climbs Down 75 Stairs On Hand In 25 Seconds - Sakshi

నేపాల్‌కు చెందిన సైనికుడు అరుదైన గిన్నీస్ రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. కేవలం చేతులను మాత్రమే ఉపయోగించి 75 మెట్లను 25.03 సెకన్లలో కిందకు దిగి చరిత్ర సృష్టించాడు. దీంతో ప్రపంచంలోనే ఇప్పటివరకు ఈ ఫీట్‌ను సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

వేగంగా మెట్లపై కిందకు దిగే పోటీకి ప్రపంచంలోనే మంచి ప్రజాధరణ ఉంది. అయితే.. ఇందులో ఇలా మెట్లను దిగడంలో కేవలం చేతులను మాత్రమే ఉపయోగించాలి. శరీర బరువు మొత్తం చేతులపై మోస్తూ మెట్లపై నుంచి కిందకు దిగాలి. ఇలా దిగే క్రమంలో బ్యాలెన్స్ మిస్‌ కాకుండా చూసుకోవడం చాలా కీలకం. ఈ పోటీలో  ఇప్పటివరకు 30..8 సెకన్లతో అమెరికాకు చెందిన వ్యక్తిపై రికార్డ్ ఉంది. దీనిని ప్రస్తుతం నేపాల్‌కు చెందిన సైనికుడు హరి చంద్ర గిరి ఛేదించాడు. 

ఖాట్మండ్ లోయలో ఉన్న బుద్దిస్ట్ దేవాలయం జమ్‌చెన్ విజయ స్థూపంపై ఉన్న మెట్లపై హరి చంద్ర ఈ ఫీట్‌ను సాధించాడు. అయితే.. తాను 8 ఏళ్ల వయస్సు నుంచి చేతులపై నడిచే నైపుణ్యాన్ని సాధన చేస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం గిన్నీస్ రికార్డ్ సాధించడం ఆనందాన్నిచ్చిందని అన్నారు.

ఇదీ చదవండి: స్పైడర్ మ్యాన్ వేషధారణలో బాలుడు.. పార్కుకి వెళ్తే.. 

    

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top