
ఉక్రెయిన్‌పై మిసైల్ దాడులతో దూకుడు పెంచిన రష్యా ఒకవేళ నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు అని హెచ్చరించింది. అవసరమనుకుంటే అణ్వాయుధ దాడికి దిగుతానని వార్నింగ్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ ఉద్రిక్తతల నడుమ పశ్చిమ యూరప్‌లో నాటో దళాలు అణు నిరోధ కసరత్తులు నిర్వహించాయి.
ఇది తమ రోటిన్ అణు నిరోధక డ్రిల్ అని నొక్కి చెబుతోంది. వాస్తవానికి ఈ కసరత్తులు రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగక మునుపే ఈ కసరత్తుల ప్రణాళిక ఉందని తెలిపింది. ఈ విన్యాసాలకు రష్యా బెదిరింపులతో సంబంధంల లేదని నాటో స్పష్టం చేసింది. పుతిన్ బెదిరింపుల మధ్య తాము కసరత్తులు నిర్వహించకపోతే తప్పు అర్థం వస్తుందని స్పష్టం చేసింది. అలా రద్దు చేస్తే తమ సైనిక బలాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని చెప్పింది.
అయినా పుతిన్ అణ్వాయుధాలకు పాల్పడతానని హెచ్చరిక నేపథ్యంలో నాటో జనరల్ స్టోలెన్‌బర్గ్ ఈ కసరత్తులు రద్దు చేయకూడదని నిర్ణయించారు. ఏం చేసినా రష్యా అణుదాడికి సంబంధించిన వైఖరిలో మార్పు ఉండదని తెలుసన్నారు. ఏదీఏమైన తాము మాత్రం అప్రమత్తంగా ఉంటామని చెప్పారు.
(చదవండి: జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా నిరసనలు...ఈడ్చుకెళ్లి చితకబాది...:)