‘నాసా’ చిత్రం; మంచుతో కప్పబడిన హిమాలయాలు

NASA Shares Beautiful Photo Of Himalayas From Space - Sakshi

అమెరికా: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతశ్రేణులు ఏవంటే వెంటనే గుర్తుకు వచ్చేవి హిమాలయాలు. ఎప్పడూ మంచుతో కప్పబడి ఉండే హిమాలయాకు సంబంధించి తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ అరుదైన చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌​ చేసింది. ‘అంతరిక్షం నుంచి చూస్తే.. దట్టమైన తెల్లని మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతశ్రేణులు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సిబ్బంది తీసింది’ అని కాప్షన్‌ జతచేసింది. అదే విధంగా ఈ చిత్రంలో హిమాలయాలతో పాటు ప్రకాశవంతమైన కాంతులతో ​కూడిన న్యూఢిల్లీ నగరం, లాహోర్‌, పాకిస్తాన్‌ దర్శనమిసున్నాయని పేర్కొంది. చదవండి: చల్లని ‘రాజా’ ఓ చందమామ

ఫొటోలోని కుడివైపు లేదా హిమాలయాలకు దక్షిణ భాగంలో ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని సారవంతమైన వ్యవసాయ భూమి కనిపిస్తోందని పేర్కొంది. నాసా విడుదల చేసిన ఈ చిత్రం సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లక్షల మంది ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో వీక్షించగా వేలాది మంది అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ‘వావ్‌.. ఇది చాలా అందమైన ఫొటో’, కచ్చితంగా ఆశ్చర్యపరిచే అద్భుతమైన చిత్రం’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి చిత్రాలను నాసా గతంలో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top