బాప్‌రే!.... నెపోలియన్‌ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!

Napoleon Sword And Pistol From 1799 Coup Sold At US Auction For 2.8 Million Dollars - Sakshi

Napoleon Sword And Pistol From 1799 Coup: చాలామంది రాజుల కాలం నాటి వస్తువులను సొంతం చేసుకువాలనే కాక వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అవి వేల ఏళ్ల నాటి చరిత్రకు అత్యంత విలువైన ఆనావాళ్లు. అలాంటి ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు, ఫ్రాన్స్‌ చక్రవర్తి అయిన నెపొలియన్‌ 1799లో తిరుగుబాటు చేసినప్పుడు ఉపయోగించిన కత్తి, తుపాకులు తదితర వస్తువులు వేలంలో అత్యధిక ధర పలికాయట.

(చదవండి: జైలును ఆర్ట్‌ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!)

అసలు విషయంలోకెళ్లితే 1799లో తిరుగుబాటు జరిగినప్పుడు నెపోలియన్ బోనపార్టే తీసుకెళ్లిన ఖడ్గం అతని ఇతర ఐదు తుపాకీలు వేలంలో $2.8 మిలియన్ల(రూ.21 కోట్లు)కి అమ్ముడయ్యాయని యూఎస్‌ వేలందారులు  ప్రకటించారు. ఈ మేరకు ఇల్లినాయిస్‌కు చెందిన రాక్ ఐలాండ్ వేలం కంపెనీ అమ్మకానికి ఉంచిన ఈ విలువైన వస్తువులను  ఒక అజ్ఞాత వ్యక్తికి ఫోన్ ద్వారా విక్రయించినట్లు కంపెనీ అధ్యక్షుడు కెవిన్ హొగన్ తెలిపారు. పైగా ఆ వ్యక్తి నెపోలియన్ ధరించిన వస్తువులను కొనుగోలుచేసి చాలా అరుదైన చరిత్రను తన ఇంటికి తీసుకువెళుతున్నాడు అని హొగన్ అన్నారు.

అయితే ఖడ్గం, ఐదు ఆభరణాలు కలిగిన తుపాకులు విలువ వేలం ప్రారంభంలోనే $1.5 మిలియన్(రూ. 11 కోట్లు) నుండి $3.5 మిలియన్(రూ. 28 కోట్లు)వరకు పలికింది. అంతే కాదు ఈ విలువైన ఆయుధాలను వెర్సైల్స్‌లోని రాష్ట్ర ఆయుధ కర్మాగారానికి డైరెక్టర్‌గా ఉన్న నికోలస్-నోయెల్ బౌటెట్ తయారు చేశారు. అయితే నెపోలియన్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన తర్వాత తన ఖడ్గాన్ని జనరల్ జీన్-అండోచే జునోట్‌కి అందించాడని, తదనంతరం జనరల్‌ భార్య అప్పులు తీర్చడానికి దానిని అమ్మవలసి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. పైగా ఈ ఏడాది మేలోనే ఫ్రాన్స్‌ నెపోలియన్ మరణ ద్విశతాబ్ది వేడుకలను జరుపుకోవడం విశేషం.

(చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top