 
													US Diplomatic Boycott Of Beijing Winter Olympics: అమెరికా 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యసంబంధమైన బహిష్కరణ(డిప్లొమేటిక్ బాయ్‌కాట్) చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీసీ) పేర్కొంది. ఈ మేరకు దౌత్యవేత్తలు అయిన ప్రభుత్వ అధికారుల ఉనికి ప్రతి దేశ ప్రభుత్వానికి పూర్తిగా రాజకీయ నిర్ణయం అని అందువల్ల ఆయా దేశాల రాజకీయ తటస్థ వైఖరిని పూర్తిగా గౌరవిస్తాం అని ఐఓసీ ప్రతినిధి అన్నారు.
(చదవండి: దేనికైనా రెడీ అంటూ!... సింహానికి సవాలు విసురుతూ... ఠీవిగా నుంచుంది కుక్క!!)
అయితే ఈ దౌత్యపరమైన బహిష్కరణ అనేది యూఎస్ అథ్లెట్లు పోటీ పడకుండా నిరోధించే చైనా మానవ హక్కుల రికార్డుకు క్రమాంకనం చేసిన మందలింపు చర్యగా యూఎస్ అభివర్ణించింది. అంతేకాదు దౌత్యపరమైన బహిష్కరణ అంటే ఈ ఒలింపిక్ క్రీడలు ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో అమెరికా దౌత్య అధికారులను పంపకుండా ఒలింపిక్ ప్రాధాన్యతను తగ్గించేలా చైనాతో నేరుగా ఢీ కొనే పరంపరలో అమెరికా తీసుకున్న తొలి నిర్ణయం ఇది.
వాయువ్య జిన్‌జియాంగ్ ప్రాంతంలో ఉయ్‌ఘర్ ముస్లింలపై చైనా మారణకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ క్రీడలపై ఎటువంటి నిర్ణయం తీసకువాలని వాషింగ్టన్ నెలల తరబడి తర్జనభర్జనలు పడిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
ఈ మేరకు ఐఓసీ కూడా అమెరికా ప్రభుత్వ ప్రకటన మేరకు ఒలింపిక్ క్రీడలు, అథ్లెట్ల భాగస్వామ్య రాజకీయాలకు అతీతమైనదని, పైగా దీనిని తాము స్వాగతిస్తున్నాం అని తెలపడం విశేషం. అంతేకాదు యూఎన్ జనరల్ అసెంబ్లీలో దాదాపు 193 సభ్య దేశాల ఏకాభిప్రాయంతో 173 సభ్య దేశాలు సహకారంతో ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు ఐఓసీ తెలిపింది. అయితే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అటువంటి బహిష్కరణ అమలు చేస్తే "నిశ్చయమైన ప్రతిఘటన" ఉంటుందంటూ ముందుగానే బెదిరించింది.
(చదవండి: ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!!)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
