కాలిఫోర్నియాలో అంతుచిక్కని వెలుగురేఖ!

Mysterious streaks of light seen in the sky over California - Sakshi

కాలిఫోర్నియా: ఆకాశంలో ఎవరికీ అంతుచిక్కని వెలుగు రేఖ ఒకటి అమెరికా కాలిఫోర్నియోలోని శాక్రమెంటోలో కనిపించింది. సెయింట్‌ పాట్రిక్‌ డే వేడుకల్లో ఉన్న వారంతా నీలాకాశంలో కనిపించిన ఆ వెలుగుని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. వెంటనే తమ చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్‌ కెమెరాల్లో దానిని బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కేవలం 40 సెకండ్ల పాటు మాత్రమే కనిపించి ఆ వెలుగురేఖ అదృశ్యమైపోయింది. ‘‘ఇప్పటివరకు ఇలాంటి దృశ్యాన్ని మేము చూడలేదు.

ఆకాశంలో ఏదో మండుతున్నట్టుగా ఒక వెలుగు కొన్ని సెకండ్లు కనిపించి మాయమైపోయింది. ఇది ఎందుకు కనిపించిందో ఎవరైనా చెప్పగలరా’’ అంటూ దానిని వీడియో తీసిన హెర్నాండెజ్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వీడియోను చూసిన హార్వార్డ్‌–స్మిత్‌సోనియాన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన జోనాథాన్‌ మెక్‌డొవెల్‌ అంతరిక్షంలో మండించే శిథిలాల్లో ఒక చిన్న తునక కావడానికి 99.9% ఆస్కారం ఉందని బదులిచ్చారు. జపాన్‌కు చెందిన రిటైర్‌ అయిన కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ఇటీవల మంటల్లో దగ్ధం చేశారని,  దాని తాలూకు చిన్న తునక అలా కనిపించి ఉంటుందని అంచనా వేశారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top