breaking news
st patricks
-
కాలిఫోర్నియాలో అంతుచిక్కని వెలుగురేఖ!
కాలిఫోర్నియా: ఆకాశంలో ఎవరికీ అంతుచిక్కని వెలుగు రేఖ ఒకటి అమెరికా కాలిఫోర్నియోలోని శాక్రమెంటోలో కనిపించింది. సెయింట్ పాట్రిక్ డే వేడుకల్లో ఉన్న వారంతా నీలాకాశంలో కనిపించిన ఆ వెలుగుని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. వెంటనే తమ చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్ కెమెరాల్లో దానిని బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కేవలం 40 సెకండ్ల పాటు మాత్రమే కనిపించి ఆ వెలుగురేఖ అదృశ్యమైపోయింది. ‘‘ఇప్పటివరకు ఇలాంటి దృశ్యాన్ని మేము చూడలేదు. ఆకాశంలో ఏదో మండుతున్నట్టుగా ఒక వెలుగు కొన్ని సెకండ్లు కనిపించి మాయమైపోయింది. ఇది ఎందుకు కనిపించిందో ఎవరైనా చెప్పగలరా’’ అంటూ దానిని వీడియో తీసిన హెర్నాండెజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వీడియోను చూసిన హార్వార్డ్–స్మిత్సోనియాన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన జోనాథాన్ మెక్‌డొవెల్ అంతరిక్షంలో మండించే శిథిలాల్లో ఒక చిన్న తునక కావడానికి 99.9% ఆస్కారం ఉందని బదులిచ్చారు. జపాన్‌కు చెందిన రిటైర్ అయిన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇటీవల మంటల్లో దగ్ధం చేశారని, దాని తాలూకు చిన్న తునక అలా కనిపించి ఉంటుందని అంచనా వేశారు. -
సెయింట్ ప్యాట్రిక్స్ గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా అక్షిత్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ప్యాట్రిక్స్ జట్టు 195 పరుగుల అధిక్యంతో ఘన విజయం సాధించింది. 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అక్షిత్ జట్టు అభిలాష్ (5/15) ధాటికి 122 పరుగులకే కుప్పకూలింది. శాంతి ఎలెవన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో స్టార్లెట్స్ జట్టు 29 పరుగుల తేడాతో ఓడింది. సురేష్ (5/37) రాణించినా ప్రయోజనం లేకపోయింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు శాంతి ఎలెవన్: 133 (వినీత్ 32; సురేష్ 5/37); స్టార్లెట్స్: 104 (అజయ్ కుమార్ 31; దుర్గా ప్రసాద్ 6/39). సెయింట్ ప్యాట్రిక్స్: 317/8 (సాత్యకి 85, రుషికేష్ 80, కృష్ణ 40, సన్నిద్ 50; చంద్ర 3/70); అక్షిత్ సీసీ: 122 (రిత్విక్ 41; అభిలాష్ 5/15). క్లాసిక్: 248 (రషీద్ 34, లయీఖ్ 31, అలీ ఖాన్ 50, సయ్యద్ ఇమ్రాన్ 43; సాగర్ 5/45); గగన్ మహల్: 212 (అతుల్ జాలి 103; ర ఫీ 5/65, లయీఖ్ 5/45 ). ఏవీసీసీ: 293 (ప్రతీక్ రెడ్డి 50, గౌరవ్ రెడ్డి 86 , రే వంత్ 50, యష్ కపాడియా 50, నరేష్ సాగర్ 3/88); విజయానంద్: 141 (కరీం 50, సుమీత్ 3/3). వీపీ విల్లోమెన్: 68 (మహర్ 3/13, గంగాధర్ 3/1); విక్టర్: 59 (షాకిర్ అహ్మద్ 7/18). సెయింట్ మేరీస్: 181 (రోహిత్ 62, కుందన్ 30; రణధీర్ 4/74, వినయ్ 5/23); నవజీవన్ ఫ్రెండ్స్: 125 (వశిష్ట 3/25, నరేష్ 3/39). విక్టరీ: 240/6 ( సోహైల్ ఖాన్ 94); వాకర్ టౌన్: 242/4 (రాము 75, నర్సింగ్ రావు 99). టీమ్ కున్: 249/3 (మహ్మద్ తాహా షేక్ 122 నాటౌట్, చరణ్ 55); హైదరాబాద్ పేట్రియాట్స్: 233 (మహ్మద్ అలీ 118; మహ్మద్ తాహా షేక్ 5/58). పీఎన్సీసీ: 56 (అభిషేక్ 4/12, పవన్ 5/21); విజయ్ సీసీ: 57/1. గన్‌రాక్: 69 (సూర్య 6/33); చమ్స్ ఎలెవన్: 70/2 (కార్తీక్ 36). మాంచెస్టర్: 240/9 (శేషగిరి 74, మధు 53 నాటౌట్; అనిల్ కుమార్ 4/67); తారకరామ: 149 (అనిల్ కుమార్ 42; వంశీ 3/30, రఘు 3/30). డెక్కన్ కోల్ట్స్: 103 (చందు 4/30); ధృవ్ ఎలెవన్ 104/8 (అజీం 56; సంతోష్ 4/41). విజయ భారతి: 134 (రాజు 34; శ్రవణ్ నాయుడు 5/20); హెచ్‌జీసీ : 135/3 (రణధీర్ 61, సీబీ 3/15). యంగ్ సిటిజన్: 202 (సాగర్ 39, ఆకాన్ష్ 45); హెచ్‌పీఎస్ ఆర్: 206/3 (సింహ 79 నాటౌట్, అభిరథ్ రెడ్డి93; రతన్ తేజ 3/22). యునెటైడ్: 93 (నారాయణ 34; శ్రీకాంత్ 6/10, జితేందర్ గౌడ్ 3/19); అంబర్పేట్: 99/2 (సందీప్ 54). హెచ్‌యూసీసీ: 149 (సయ్యద్ మవీనుద్దీన్ 34, అస్లామ్ అక్బర్ హుస్సేన్ 47, సయ్యద్ హషమ్ 3/55, అబ్దుల్ అజీమ్ 4/27), అపెక్స్ సీసీ: 150 (అన్వర్ అలీ 46, సయ్యద్ జావీద్ 38 నాటౌట్, సయ్యద్ పాషా అలీ 33 నాటౌట్).