టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్‌!!..

Mother And Daughter Jailed After Police Mistake Tea For Drugs - Sakshi

కాన్‌బెర్రా: కొన్ని అనుకోని సంఘటనల్లో తప్పుడు ఆరోపణలతో జైలు పాలైనప్పుడు అత్యంత బాధ అనిపిస్తుంది. అంతేకాదు మన న్యాయశాస్త్రం కూడా ఒక అపరాధికి శిక్ష పడకపోయినా పర్వాలేదు గానీ ఒక నిరపరాధికి మాత్రం శిక్షపడకూడదనే నొక్కి చెబుతుంటాయి. కానీ చాలా కేసుల్లో మాత్రం దీన్ని ఉల్లంఘిస్తున్నారనడంలో సందేహం లేదు. అంతేకాదు  తప్పుడు అభియోగాలతో నిస్సహాయులు, అభాగ్యులు జైలు పాలవుతున్న సందర్భాలు అనేకం. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఆస్ట్రేలియాలోని తల్లి కూతుళ్లు ఎదుర్కొన్నారు.

(చదవండి: వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!)

అసలు విషయంలోకెళ్లితే....టీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సురక్షితమైన సాంప్రదాయ పానీయాలలో ఒకటి టీ. అంతేందుకు ప్రయాణంలో చాలామంది టీ తాగేందుకే ఆసక్తి కనబరుస్తారని చెప్పక తప్పదేమో!. పాపం ఆ ఉద్దేశంతోనే కాబోలు వున్ పుయ్ కానీ చోంగ్, ఆమె కుమార్తె శాన్ యాన్ మెలానీ తమ స్వదేశం అయిన మలేషియా నుంచి సుమారు 25 కిలోల బ్రౌన్‌ జింజర్‌ టీ పొడిని దిగుమతి చేసుకుని మంచి ధరకు ఆస్టేలియాలో అమ్ముకుని లాభాలు గడించాలని ఆశిస్తారు. అయితే ఈ టీ పోడి మహిళలు ఎదర్కొనే పిరియడ్‌ పెయిన్‌ని పోగట్టడంలో మంచి జౌషధంగా పనిచేస్తుంది కాబట్టి  ఈ టీ పొడికి మంచి మార్కెట్‌ ఉంటుందన్న ఆశతో అంత ఎక్కువ మొత్తంలో ఆస్ట్రేలియాకు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.

అయితే ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ (ఏబీఎఫ్‌) అధికారులు టీ ప్యాకేజీలను విమానాశ్రయంలో స్వాధీనం చేసుకోవడంతో వారి వ్యాపార ప్రణాళికకు బ్రేక్‌ పడుతుంది. ఈ అనుహ్య ఘటనకు ఆ తల్లి, కూతుళ్లు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. పైగా ఆ విమానాశ్రయ అధికారులు ఆ టీ పొడిని యాంఫెటమైన్ డ్రగ్ ఫెన్‌మెట్రాజైన్‌గా తప్పుగా భావించి ఆ తల్లి కూతుళ్లను అరెస్ట్‌ చేయడమే కాక నాన్‌ బెయిలబుల్‌ కేసుగా నమోదు చేయడంతో నాలుగు నెలలు పాటు జైల్లోనే గడుపుతారు.

ఆ తర్వాత న్యూ సౌత్ వేల్స్ పోలీసులు రంగంలోకి దిగి స్వయంగా ఫోరెన్సిక్ పరీక్షలు చేయడంతో ఆ తల్లి కూతుళ్లు తప్పుడు ఆరోపణలతో అరెస్టు అయినట్లు స్థానిక కోర్టు గుర్తించి వారిని విడుదల చేస్తుంది. అంతేకాదు ఏబీఎఫ్‌ అధికారులు పొరబడినట్లు ఆస్ట్రేలియ ఫెడరల్‌ పోలీసలు కోర్టుకు తెలియజేయడమే కాక ఫోరెన్సిక్‌ పరీక్షల్లో ఎటువంటి నిషేధిత ఉత్ప్రేరకాలు లేవని నిర్ధారించిన రిపోర్ట్‌లను కోర్టుకి సమర్పించడంతోనే ఆ తల్లికూతుళ్లు విడుదల అవుతారు. ఏదిఏమైన ఈ విధంగా అన్యాయంగా అరెస్టు కావడం వల్ల వాళ్లు మానసికంగానూ, శారిరకంగానూ ఎంతో ఆవేదన అనుభవించి ఉంటారు కదా!.

(చదవండి: అమెజాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top