Amazon India Executives: డైరెక్టర్‌ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు

Amazon India Executives Booked For Online Delivery Of Drugs - Sakshi

ఇండోర్‌: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఆన్‌లైన్‌లో గంజాయిని విక్రయిస్తుందనే ఆరోపణలతో అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ల పై మధ్యప్రదేశ్ పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో పోలీసులు గతవారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సుమారు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

(చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్‌ మైనర్‌ బాలుడి పై అత్యాచారం, హత్య)

అంతేకాదు తాము అమెజాన్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ డ్రగ్ స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్‌ను ఛేదించినట్లు పేర్కొన్నారు. దీంతో కాన్ఫెడరేషన్ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌పై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అమెజాన్ ఇండియా ప్రతినిధి దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం, మద్దతును ఇస్తానని హామీ కూడా ఇచ్చిన సంగతని ఈ సందర్భంగా పోలీసులు గుర్తుచేశారు. పైగా అమెజాన్‌ సంస్థ సకాలంలో స్పందించి అందించిన వివరాలు తాము వెలకితీసిన సాక్ష్యాధారాలకు విరుద్ధంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు.

అంతేకాదు వివిధ చిరునామాలకు బుక్ చేసి డెలివరీ చేసిన 20 నిషేధిత సరుకుల వివరాలు ఇంకా అందాల్సి ఉందని భింద్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ..."ఈ కేసు విచారణకు ఈ-కామర్స్ దిగ్గజం సహకరించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఆన్‌లైన్ వ్యాపారాలకు ఎటువంటి మార్గదర్శకాలు లేవు. అంతేకాదు అమెజాన్‌కు కాల్ చేసినా వారు స్పందించడం లేదన్నారు. దయచేసి మాకు సహకరించండి లేనట్లయితే అమెజాన్‌ ఎండీ సీఈవోకి విజ్ఞప్తి చేస్తాం లేదా తదుపరి చర్యలు త్వరిత గతిన ప్రారంభిస్తాం" అని హెచ్చరించారు.

(చదవండి: హే! ఇది నా హెయిర్‌ స్టైయిల్‌... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top