మంకీపాక్స్‌ : యూఏఈతో పాటు అక్కడా కేసులు.. కరోనాలాగా విజృంభిస్తుందా? లేదా?

Monkeypox Virus Updates: UAE Reports First Case - Sakshi

ఊహించినదానికంటే వేగంగానే.. మంకీపాక్స్‌ వైరస్‌ మరికొన్ని దేశాలకు శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లోనూ  మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. 

వెస్ట్‌ ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళ శాంపిల్‌లో మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించినట్లు యూఏఈ వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్‌ నిర్ధారణ కావడంతో ఆమె నుంచి వివరాలు సేకరించి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపడతాం అని అధికారులు వెల్లడించారు. 

అలాగే బెల్జియం నుంచి తిరిగి స్వదేశానికి(చెక్‌ రిపబ్లిక్‌) చేరుకున్న ఓ మహిళలోనూ వైరస్‌ జాడ గుర్తించారు. వీటితో పాటు మరో మూడు అనుమానిత కేసుల ఫలితాలు రావాల్సి ఉందని చెక్‌ రిపబ్లిక్‌ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

అయితే వైరస్‌ కేసులు పెరుగుతున్న వేళ.. వైద్య నిపుణులు అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. మంకీపాక్స్‌కు చికిత్స ఉందని, పైగా ప్రమాదం తక్కువగా పొంచి ఉందని,  SARS-COV-2 లాగా వైరస్ అంత తేలికగా వ్యాప్తి చెందే అవకాశమే లేదని భరోసా ఇస్తున్నారు. ఇక మంకీపాక్స్‌ వైరస్‌లోనూ వేరియెంట్లు గుర్తించిన సైంటిస్టులు.. ప్రస్తుత విజృంభణ పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశాలకు సూచిస్తున్నారు.

ఇప్పటివరకు 19 దేశాల్లో.. 237 మంకీపాక్స్‌ కేసులు బయటపడ్డాయి. యూరప్‌, నార్త్‌ అమెరికా, ఆస్ట్రేలియాలో మంకీపాక్స్‌ విజృంభణ వెలుగు చూశాక.. ప్రపంచ ఆరోగ్య సంస్థ  పలుదేశాలకు హెచ్చరికలు జారీ చేసింది.

చదవండి: అసాధారణ శృంగారం వల్లే మంకీపాక్స్‌!

చదవండి: మంకీపాక్స్‌ లక్షణాలు ఇవే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top