‘ఊపిరి’ సినిమాలో సీన్‌ మాదిరిగా, పికిల్‌ ఆర్ట్‌ 4 లక్షలు.. నెటిజన్ల ట్రోలింగ్‌

Matthew Griffin New Work Is McDonald Pickle Art That Cost 4 Lakhs - Sakshi

‘ఊపిరి’ సినిమా చూశారా? అందులో మోడర్న్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌కు వెళ్లిన హీరో... జనం వాటికి ఎందుకన్ని లక్షల పెడుతున్నారో అర్థంకాక.. నవ్వుకుంటాడు. ఇంటికొచ్చి తనూ ఓ పెయింటింగ్‌ వేసి లక్షలకు అమ్మేస్తాడు. గుర్తుందా? అచ్చం అలాంటి సంఘటనే ఆస్ట్రేలియా లో జరిగింది. ఆర్టిస్ట్‌ మాథ్యూ గ్రిఫిన్‌... మెక్‌డొనాల్డ్స్‌ చీజ్‌ బర్గర్‌ తింటుండగా, అందులోని ఓ పికిల్‌ పీస్‌ వెళ్లి సీలింగ్‌కు తగిలింది.

తెల్లని సీలింగ్‌పై అదో అద్భుతమైన చిత్రంగా తోచిందతనికి. ఇంకేముంది... ఆ పాపులర్‌ పికిల్‌తో చిత్రాన్ని రూపొందించి.. ఓ ఆస్ట్రేలియన్‌ ఎగ్జిబిషన్‌లో ఉంచాడు. దానికి ‘పికిల్‌’ అని పేరు పెట్టి, రూ.4లక్షలు ధర నిర్ణయించాడు. సిడ్నీ ఎగ్జిబిషన్‌లోని ఫైన్‌ ఆర్ట్స్‌లో ప్రదర్శించిన 4 ఆర్ట్‌ వర్క్స్‌లో అదీ ఒకటి. జూలై 30 వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్‌ వివరాలను సిడ్నీ ఫైన్‌ ఆర్ట్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ పేజ్‌లో పంచుకున్నారు. అంతే.. అది చూసిన నెటిజన్స్‌ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. ‘నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు  మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లి అలా చేసినందుకు నన్ను పోలీసులు అక్కడి నుంచి తరిమారు.

ఇప్పుడు మాత్రం కళాఖండమైంది’ అంటూ ఓ నెటిజన్‌ స్పందించారు. ఇక ‘ఇలాంటి ఆర్ట్‌వర్క్‌ను ఎలా ప్రదర్శిస్తారు?’ అంటూ చిరాకు పడ్డవా­రూ ఉన్నారు. అయితే ‘ఆన్‌లైన్‌లో ఆ పెయింటింగ్‌పై వచ్చిన హాస్యా స్పద స్పందనను పట్టించుకోవద్దు’ అంటున్నా డు ఫైన్‌ ఆర్ట్స్‌ డైరెక్టర్‌ ర్యాన్‌ మూరే. ఫన్నీగా ఉన్నంత మాత్రాన దానికున్న విలువ, దాని అర్థం మారిపోదని చెబుతున్నాడు.
 
   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top