Mexico Bus Accident: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం

Massive Bus Accident In Mexico: 19 Killed And 32 Wounded In Road Incident - Sakshi

Massive Bus Accident In Mexico: సెంట్రల్‌ మెక్సికోలో యాత్రికులను తీసుకువెళ్తున్న ఓ  బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 32 మందికి గాయలైయ్యాయి. అయితే బస్సు బ్రేకులు కోల్పోయి మెక్సికో రాష్ట్రంలోని ఒక భవనంపైకి దూసుకెళ్లడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని  అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ప్రమాదం మెక్సికో సిటీకి నైరుతి దిశలో ఉన్న జోక్విసింగో టౌన్‌షిప్‌లో జరిగిందని రాష్ట్ర అంతర్గత కార్యదర్శి రికార్డో డి లా క్రూజ్ వెల్లడించారు.

(చదవండి: ఆ పిల్లాడి కంటే ఈ కుక్క పిల్లే భలే మాట్లాడేస్తోంది!!!)

ఈ మేరకు ఆయన ఈ బస్సు పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్ నుండి శతాబ్దాలుగా రోమన్ క్యాథలిక్ యాత్రికులు సందర్శించే ఛల్మా పట్టణానికి వెళ్తోండగా ఈ  ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. అయితే  గాయపడిన ప్రయాణికుల పరిస్థితిపై ఎటువంటి తక్షణ సమాచారం లేదన్నారు. పైగా చాలా మంది మెక్సికన్లు డిసెంబర్ 12, వర్జిన్ ఆఫ్ గ్వాడాలుపే రోజు సమీపిస్తున్న కొద్దీ మతపరమైన తీర్థయాత్రలకు వెళ్తుంటారని చెబుతున్నారు.

అంతేకాదు వారు తరచుగా ఇరుకైన రోడ్లపై నడవడం, కాలం చెల్లిన బస్సులలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే 1521 ఆక్రమణకు ముందు హిస్పానిక్ పూర్వ కాలంలో ఛల్మా ఒక పవిత్ర ప్రదేశం. అంతేకాక స్పానిష్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత అజ్టెక్ దేవుడికి అంకితం చేయబడిన ఒక గుహలో ఒక శిలువ అద్భుతంగా కనిపించింది. దీంతో అప్పటి నుంచి ఈ ఛల్మా పేరుగాంచిన క్రైస్తవ తీర్థయాత్ర మారింది. అంతేకాదు పెద్ద ఎత్తున భక్తులు భక్తులు చల్మాను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు.

(చదవండి: కరోనా కొత్త వేరియంట్‌.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top