2020లో అతి జుగుప్సాకరమైన క్రైం ఇదే! | Man Smuggles Samosa Between His Buttocks In England | Sakshi
Sakshi News home page

ఇలాంటి క్రిమినల్‌ను మీ జన్మలో చూసుండరు!

Jan 2 2021 11:03 AM | Updated on Jan 2 2021 2:53 PM

Man Smuggles Samosa Between His Buttocks In England - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఓ వింతైన, జుగుప్సాకరమైన కేసుగా దాన్ని పరిగణించారు. మరి పోలీసులనే బెంబేలెత్తించిన ఆ నేరం ఏంటంటే...

లండన్‌ : అవును! మీరు చదివింది అక్షరాల నిజం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే నేరస్తుడు అంత ప్రత్యేకమైన వాడు. అతడు చేసిన నేరం నిజంగా అతి జుగుప్సాకరమైనదే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని బర్మింగ్‌హాం పోలీసులు కూడా ధ్రువీకరించారు. 2020లో తమ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ వింతైన, జుగుప్సాకరమైన కేసుగా దాన్ని పరిగణించారు. మరి పోలీసులనే బెంబేలెత్తించిన ఆ నేరం ఏంటంటే.. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హాంకు చెందిన ఓ నేరస్తుడు సమోసా స్మగ్లింగ్‌ చేయటం. సమోసా స్మగ్లింగ్‌ నేరమా? అని అనుకుంటున్నారా. అయితే ఈ వార్త చదవండి. ( ఆల్రెడీ పెళ్లైన ప్రేయసి ఇంటికి సొరంగం)

2020లో వెస్ట్‌ మిడ్‌ల్యాండ్‌ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతడ్ని సెల్‌లో వేయటానికి ముందు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతడు తన పిరుదుల మధ్యలో సమోసాను ఉంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై అతడ్ని ప్రశ్నించగా.. సదరు పోలీస్‌స్టేసన్‌లో ఆహారం ఏమీ బాగుండదని, అందుకే స్నాక్‌లా తినటానికి సమోసాను తెచ్చుకున్నానని సమాధానం ఇచ్చాడు. దీంతో సమోసా స్మగ్లింగ్‌ ఘటన వెస్ట్‌ మిడ్‌ల్యాండ్‌ పోలీసులకు బాగా గుర్తుండిపోయింది. 2020లో తాము చూసి అతి విచిత్రమైన, జుగుప్సాకరమైన నేరం అంటూ దాని గురించి చెప్పుకొచ్చారు. స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మంజ్‌ అహిర్‌ దీన్ని మర్చిపోలేని కేసుగా అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement