అమెరికాలో కూలిన సొరంగం.. కార్మికులకు తప్పిన ప్రమాదం | los angeles workers trapped after tunnel collapses | Sakshi
Sakshi News home page

అమెరికాలో కూలిన సొరంగం.. కార్మికులకు తప్పిన ప్రమాదం

Jul 10 2025 1:36 PM | Updated on Jul 10 2025 2:49 PM

los angeles workers trapped after tunnel collapses

లాస్ ఏంజిల్స్: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్ పరిధిలోని విల్మింగ్టన్ లో నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కూలిపోయింది. ఈ ఘటనలో రెస్క్యూ సిబ్బంది 31 మంది కార్మికులను  రక్షించారు. సొరంగం యాక్సెస్ పాయింట్ నుండి దాదాపు ఆరు మైళ్ల దూరంలో అది కూలిపోయిందని అధికారులు తెలిపారు.
 

సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు  100 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి తరలివెళ్లారు. వీరు 31 మంది కార్మికులను రక్షించారు. సొరంగంలోని ఒక భాగం కూలిపోవడంతో, పలువురు కార్మకులు అందులో చిక్కుకున్నారు. సమాచారం అందగానే లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక విభాగం సంఘటనా స్థలానికి చేరుకుంది. సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా, 31 మంది కార్మికులను సొరంగం నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 18 అడుగుల వెడల్పు కలిగిన ఈ సొరంగాన్ని నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్నారు. మురుగునీటిని మళ్లించేందుకు ఇది ఉపయుక్తం కానుంది. లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ ఈ సంఘటనను ‘ఎక్స్‌’లో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement