
మాస్కో: భారతీయులకు రష్యా శుభవార్త చెప్పింది. పాశ్చాత్య దేశాలు వలస నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో.. రష్యా వీసా నిబంధనల్ని సడలించింది. భారతీయులకు ఊతం ఇచ్చేలా వీసా నిబంధనలు మార్చింది. తద్వారా రష్యాలోని పలు రంగాల్లో అనుభవజ్ఞులైన భారతీయులకు డిమాండ్ పెరిగింది.
రష్యాలోని ప్రముఖ సంస్థల్లో ఎలక్ట్రానిక్స్,మెషినరీ విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇదే విషయాన్ని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ స్థానిక మీడియాకు వెల్లడించారు.
రష్యాకు మ్యాన్‌పవర్.. భారతీయుల్లో నైపుణ్యం ఉంది.వాటికి అనుగుణంగా రష్యా వీసా నిబంధనలు మార్చింది. తద్వారా స్థానిక రష్యా కంపెనీలన్నీ భారతీయుల్ని నియమించుకుంటున్నాయి. ఇప్పటికే అధికమొత్తంలో రష్యాకు భారతీయులు వచ్చారు. వచ్చిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ, వస్త్ర రంగాలలో ఉన్నారు.వీటితో పాటు మెషినరీ, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో భారతీయుల డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు.
రష్యాకు భారతీయల వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రాయబార కార్యాలయం తన సేవల్ని విస్తరించేందుకు మరింత ప్రయత్నిస్తుందని చెప్పారు. పాస్‌పోర్ట్‌లు అప్‌డేట్,అప్రూవల్ వంటి సేవలు వేగవంతం అవుతాయని తెలిపారు.