LOFTID: నవంబర్‌ 1న నాసా ‘లోఫ్టిడ్‌’ ప్రయోగం

LOFTID: NASA test a massive inflatable heat shield in low Earth orbit - Sakshi

వాషింగ్టన్‌:  అంగారక గ్రహంపై(మార్స్‌) క్షేమంగా దిగడానికి వీలు కల్పించే ప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) శ్రీకారం చుడుతోంది. ఫ్లైయింగ్‌ సాసర్‌ వంటి భారీ హీట్‌ షీల్డ్‌ను వచ్చే నెల 1న అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది.

దీనికి లో–ఎర్త్‌ ఆర్బిట్‌ ఫ్లైట్‌ టెస్ట్‌ ఆఫ్‌ యన్‌ ఇన్‌ఫ్లాటబుల్‌ డిసీలరేటర్‌(లోఫ్టిడ్‌)గా నామకరణం చేసింది. అట్లాస్‌ వి–రాకెట్‌ ద్వారా లో–ఎర్త్‌ ఆర్బిట్‌లోకి హీట్‌ షీల్డ్‌ను పంపించనుంది.  భవిష్యత్తులో మార్స్‌పైకి పంపించే అంతరిక్షనౌక వేగాన్ని తగ్గించి, ఉపరితలంపై క్షేమంగా దించడానికి ఈ హీట్‌ షీల్డ్‌ తోడ్పడనుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top