కంపెనీ ప్రమోషన్‌కు బామ్మ చావును కూడా వదలవా? సీఈఓపై నెటిజన్లు ఫైర్‌..

LinkedIn Crying CEO Turning Grandma Death into Company Promo - Sakshi

'హైపర్ సోషల్' సీఈఓ బ్రాడెన్ వాలెక్ అంటే లింక్డ్ఇన్‌లో దాదాపు తెలియని వారుండురు. ఈయన గతంలో ఓసారి సంస్థలోని ఉద్యోగులను మూకుమ్మడిగా తొలిగించిన అనంతరం ఏడుస్తున్న పోట్ షేర్ చేయడం వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి ఆయన అలాంటి ఫోటోనే షేర్ చేశారు.

తన గ్రాండ్‌మా చనిపోయిందని అమ్మ నుంచి మెసేజ్ వచ్చిందని బ్రాడెన్ ఓ పోస్టు పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ఘటన వర్క్, లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని తనకు తెలియజేసిందని చెప్పుకొచ్చాడు. తాను హైపర్సోషల్‌ను ప్రారంభించింది కూడా ఇందుకే అని పేర్కొన్నాడు. హైపర్ సోషల్‌తో వ్యాపారాన్ని సులభంగా చేసుకోవచ్చని, దీని వల్ల కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుందని వివరించాడు.

బ్రాడెన్ పోస్టుపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నారు, ఇది వెరీ సాడ్ పోస్టు అని ఓ లింక్డ్‌ఇన్ యూజర్ విమర్శించాడు. సీఈఓ పోస్టు ట్విట్టర్‌లో కూడా చర్చనీయాంశమైంది. ఈ ఏడుపు గొట్టు సీఈవో కంపెనీ ప్రచారం కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.
చదవండి: ‘కోహినూర్‌’పై బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ సమీక్ష.. భారత్‌కు అప్పగిస్తారా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top