కమలా హారిస్‌ భర్త భావోద్వేగ పోస్టు! | Kamala Harris Husband Shares Emotional Post | Sakshi
Sakshi News home page

నిన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది: కమల భర్త

Nov 11 2020 2:06 PM | Updated on Nov 11 2020 2:09 PM

Kamala Harris Husband Shares Emotional Post - Sakshi

కమలా హారిస్‌ను చూసి అమెరికా మొత్తం గర్వపడుతోందని, ఒక మహిళగా, నల్లజాతి స్త్రీగా ఆమె సాధించిన విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ కమలా హారిస్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఇండో- జమైకా మూలాలు గల ఆమె.. అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వేళ భారతీయులతో పాటు జమైకన్లు సైతం తమ ఆడపడుచు విజయాన్ని ఆస్వాదిస్తూ తనను అభినందిస్తున్నారు. అదే విధంగా ‘సెకండ్‌ జెంటిల్మెన్’‌ హోదా అనుభవించబోతున్న కమలా హారిస్‌ భర్త డగ్లస్‌ ఎమాఫ్‌కు సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో డగ్లస్‌ ఎమాఫ్‌ షేర్‌ చేసిన ఫొటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అటార్నీ జనరల్‌గా, సెనెటర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన భార్య ప్రస్తుతం ఏకంగా దేశ తొలి మహిళా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నత శిఖరాలు అధిరోహించిన వేళ తన గుండె గర్వంతో ఉప్పొంగిపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: కమలా హారిస్‌కు స్టాలిన్‌ భావోద్వేగ లేఖ!)

ఈ మేరకు కమలా హారిస్‌ను ఆత్మీయంగా హత్తుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన డగ్లస్‌.. ‘‘నిన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది’’ అంటూ ఉద్వేగపూరిత క్యాప్షన్‌ జతచేశారు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. కమలా హారిస్‌ను చూసి అమెరికా మొత్తం గర్వపడుతోందని, ఒక మహిళగా, నల్లజాతి స్త్రీగా ఆమె సాధించిన విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు చేస్తున్నారు.  కాగా డెమొక్రటిక్‌ పార్టీ కీలక నేతగా ఎదిగి ఫీమేల్‌ ఒబామాగా ప్రసిద్ధికెక్కిన కమలా హారిస్‌ తన సహచర లాయర్‌ డగ్లస్‌ ఎమాఫ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా కలిగిన ఇద్దరు పిల్లలకు ఆమె అమ్మ ప్రేమను పంచుతున్నారు. జో బైడెన్‌ తన రన్నింగ్‌మేట్‌గా ప్రకటించిన తర్వాతి మొదటి ప్రసంగంలో భాగంగా.. ‘‘నా భర్త డగ్‌, మాకు రత్నాల్లాంటి పిల్లలు ఎలా, కోల్‌ ఉన్నారు’’ అంటూ తన కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.(చదవండి: ఇవే బైడెన్‌ ప్రాథమ్యాలు..!)

So proud of you. ❤️❤️🇺🇸🇺🇸

A post shared by Doug Emhoff (@douglasemhoff) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement