North Korean Leader Kim Jong Un’s 2nd Daughter Ju Ae Made Her 2nd Public Appearance - Sakshi
Sakshi News home page

Ju Ae: కిమ్‌ వారసురాలు ఆమే? వయసు కేవలం పదేళ్లు మాత్రమే!

Nov 28 2022 6:21 AM | Updated on Nov 28 2022 10:03 AM

Ju Ae: Kim Jong Un daughter called most beloved child in 2nd appearance - Sakshi

సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ రెండో కుమార్తె జుయే తరచూ బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. కిమ్‌ వారసురాలు ఆమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జుయే వయసు కేవలం పదేళ్లు మాత్రమే.

తన తోటి వయసు పిల్లల కంటే పొడవుగా పెద్దదానిలా జుయే కనిపిస్తుందని గతంలోనే దక్షిణ కొరియా మీడియా వెల్లడించింది. అంత చిన్న వయసున్న జుయే ఖండాంతర క్షిపణి పరీక్షల ప్రయోగాలకు హాజరు కావడం విస్మయ పరుస్తోంది. ఆ ప్రయోగాల సమయంలోనే తొలిసారిగా మీడియా కంటపడింది.  తాజాగా ఆదివారం కిమ్, తన కుమార్తెతో కలిసి శాస్త్రవేత్తలు, ఇతర అధికారులతో చర్చిస్తున్న ఫోటోలను అధికారిక మీడియా విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement