60వేల మందిపై కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు | Sakshi
Sakshi News home page

మూడవ దశ ట్రయల్‌కు‌ జే అండ్ ‌జే కరోనా వ్యాక్సిన్‌

Published Thu, Sep 24 2020 8:21 AM

Johnson And Johnson Started 3rd Phase Corona Vaccine Clinical Trial - Sakshi

న్యూయార్క్‌ : ప్రముఖ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీలో మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్‌ మూడవ దశ క్లినికల్‌ ట్రయల్‌కు రంగం సిద్ధం చేసింది. ఈ దశలో దాదాపు 60 వేల మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించిన వాలంటీర్ల నమోదు ప్రక్రియకు సన్నద్ధాలు మొదలుపెట్టింది. అమెరికాతో పాటు దాదాపు 200 దేశాల వారికి నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు యూఎస్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌)తెలిపింది. (కరోనా పాపం చైనాదే)

కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్‌ నిర్వహించబోతున్న సంస్థల్లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పదవది, అమెరికా వ్యాప్తంగా నాలుగవది. సదరు కంపెనీ ఎలాంటి ఆదాయం ఆశించకుండా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి కోసం అమెరికా ప్రభుత్వం జే అండ్‌ జే కంపెనీకి 1.45బిలియన్‌ డాలర్లను ఫండ్‌గా ఇచ్చింది.

Advertisement
Advertisement