‘ఇక చాలు.. మూట ముల్లె సర్దుకో’ | Joe Biden Time For Trump To Pack His Bags Go Home | Sakshi
Sakshi News home page

చివరి రోజు ప్రచారంలో ట్రంప్‌పై బైడెన్‌ విమర్శలు

Nov 3 2020 8:55 AM | Updated on Nov 3 2020 8:57 AM

Joe Biden Time For Trump To Pack His Bags Go Home - Sakshi

వాషింగ్టన్‌: అసలు సిసలు సంగ్రామానికి నేడు తెరలేచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. డెమోక్రటిక్‌, రిపబ్లిక్‌ అభ్యర్థులు ప్రచారంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇక ప్రచారంలో చివరి రోజు సోమవారం నాడు బైడెన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంత గందరగోళం ఎన్నడు లేదు.. చాలు.. ఇక నీవు మూటముల్లె సర్దుకుని ఇంటికి బయలుదేరు అన్నారు. సోమవారం ఒహియోలో జరిగిన చివరి ఎన్నికల ర్యాలీలో బైడెన్ మాట్లాడుతూ.. ‘గందరగోళంతో మేం విసిగిపోయాం. ట్వీట్లు, కోపం, ద్వేషం, వైఫల్యం, బాధ్యతారాహిత్యంతో మేం విసిగిపోయారం. ఇక చాలు. డొనాల్డ్‌ ట్రంప్‌ తన లగేజ్‌ సర్దుకుని ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమయ్యింది’ అన్నారు. ఇక తాను అధ్యక్షుడిగా ఎన్నికయితే కరోనా వైరస్‌ని నియంత్రణలో ఉంచుతానని ప్రతిజ్ఞ చేశారు బైడెన్‌. (చదవండి: దూసుకుపోవడమే.. అనుమతి అడగొద్దు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement