అమెరికా హెల్త్‌ సెక్రటరీగా హావియర్‌ | Joe Biden picks Xavier Becerra to run Health and Human Services | Sakshi
Sakshi News home page

అమెరికా హెల్త్‌ సెక్రటరీగా హావియర్‌

Dec 8 2020 4:38 AM | Updated on Dec 8 2020 5:34 AM

Joe Biden picks Xavier Becerra to run Health and Human Services - Sakshi

హావియర్‌ బసెరా, వివేక్‌ మూర్తి

వాషింగ్టన్‌: అమెరికా ఆరోగ్య శాఖ (సెక్రెటరీ ఆఫ్‌ హెల్త్‌), హ్యూమన్‌ సర్వీసెస్‌ మంత్రిగా హావియర్‌ బసెరా ఎంపికయ్యారు. అలాగే, భారతీయ అమెరికన్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తిని సర్జన్‌ జనరల్‌గా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ఎంపిక చేసుకున్నారు. కోవిడ్‌–19 విషయంలో అమెరికా అధ్యక్షుడి చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌గా డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ, వ్యాధుల నియంత్రణ కేంద్రాల డైరెక్టర్‌గా డాక్టర్‌ రోచెల్‌ వాలెన్‌స్కీ, కోవిడ్‌–19 ఈక్విటీ టాస్క్‌ఫోర్స్‌ అధినేతగా డాక్టర్‌ మార్సెలా నూనెజ్‌ స్మిత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరోగ్య రంగంలో కరోనా మహమ్మారి రూపంలో అమెరికా అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జో బైడెన్‌ పేర్కొన్నారు.

మహమ్మారిని అదుపు చేసి, జన జీవనం ఎప్పటిలాగే కొనసాగే వాతావరణం కల్పించాల్సి ఉందన్నారు. హెల్త్‌ కేర్‌ టీమ్‌లోని నిపుణుల సూచనల ప్రకారం కరోనా వైరస్‌ వ్యాప్తిని కచ్చితంగా నియంత్రిస్తామని, దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెడతామని కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ వెల్లడించారు. హావియర్‌ బసెరా ప్రస్తుతం కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇక డాక్టర్‌ వివేక్‌ మూర్తి 2014 నుంచి 2017 వరకు అమెరికాస్‌ డాక్టర్‌ అనే పదవిలో ఉన్నారు. జో బైడెన్‌కు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్‌–19 ట్రాన్సిషన్‌ అడ్వైజరీ బోర్డు కో–చైర్మన్‌గా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement