breaking news
surgeon general
-
అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్
వాషింగ్టన్: అమెరికా ఆరోగ్య శాఖ (సెక్రెటరీ ఆఫ్ హెల్త్), హ్యూమన్ సర్వీసెస్ మంత్రిగా హావియర్ బసెరా ఎంపికయ్యారు. అలాగే, భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఎంపిక చేసుకున్నారు. కోవిడ్–19 విషయంలో అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా డాక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధుల నియంత్రణ కేంద్రాల డైరెక్టర్‌గా డాక్టర్ రోచెల్ వాలెన్స్కీ, కోవిడ్–19 ఈక్విటీ టాస్క్‌ఫోర్స్ అధినేతగా డాక్టర్ మార్సెలా నూనెజ్ స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరోగ్య రంగంలో కరోనా మహమ్మారి రూపంలో అమెరికా అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జో బైడెన్ పేర్కొన్నారు. మహమ్మారిని అదుపు చేసి, జన జీవనం ఎప్పటిలాగే కొనసాగే వాతావరణం కల్పించాల్సి ఉందన్నారు. హెల్త్ కేర్ టీమ్‌లోని నిపుణుల సూచనల ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తిని కచ్చితంగా నియంత్రిస్తామని, దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెడతామని కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వెల్లడించారు. హావియర్ బసెరా ప్రస్తుతం కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇక డాక్టర్ వివేక్ మూర్తి 2014 నుంచి 2017 వరకు అమెరికాస్ డాక్టర్ అనే పదవిలో ఉన్నారు. జో బైడెన్‌కు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్–19 ట్రాన్సిషన్ అడ్వైజరీ బోర్డు కో–చైర్మన్‌గా ఉన్నారు. -
అమెరికాలో మరో భారతీయుడి ప్రభ
వాషింగ్టన్: అమెరికాలో భారతీయల ప్రభ వెలిగిపోతోంది. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగుతేజం సత్య నాదెళ్లను నియమించిన మరుసటి రోజే.. కర్ణాటక యువ కిశోరం వివేక్ మూర్తిని అమెరికాలో కీలకమైన సర్జన్ జనరల్ పదవికి సిఫారసు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మూర్తి నియామకాన్ని సెనెట్ ఆమోదించాల్సివుంది. అమెరికాలో ప్రజారోగ్యానికి సంబంధించి ఆయన ముఖ్య ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తారు. యూఎస్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ కమిషన్ దళానికి చీఫ్‌గా ఉంటారు. ఈ కమిషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్స్ దళాలకు వైద్య సేవలందిస్తుంది. ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ అమెరికన్ 36 ఏళ్ల వివేక్ కావడం విశేషం. అంతేగాక అతి పిన్న వయస్కుడు కూడా ఆయనే కావడం మరో వివేషం. వివేక్ బోస్టన్‌లో ఫిజిషియన్‌గా పనిచేయడంతో పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2008లో 'డాక్టర్స్ ఫర్ ఒబామా' అనే సంస్థను ఆరంభించి ఒబామా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఒబామా హెల్త్‌కేర్'కు మద్దతుగా నిలిచారు. -
US సర్జన్ జనరల్‌గా వివేక్ H మూర్తి