అమెరికా: మరో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం | Joe Biden Nominates Indian American Shalina D Kumar As Federal Judge | Sakshi
Sakshi News home page

అమెరికా: మరో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

Jul 1 2021 1:06 PM | Updated on Jul 1 2021 1:19 PM

Joe Biden Nominates Indian American Shalina D Kumar As Federal Judge - Sakshi

షాలినా డీ కుమార్‌ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

వాషింగ్టన్‌: అమెరికాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత సంతతి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న అధ్యక్షుడు జో బైడెన్‌.. మరో ఇండియన్‌ అమెరికన్‌ మహిళకు అరుదైన గౌరవం ఇచ్చారు. సర్య్కూట్‌ కోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌గా విధులు నిర్వహిస్తున్న భారత సంతతి మహిళ షాలినా డీ కుమార్‌ను మిచిగాన్ తూర్పు ప్రాంత ఫెడరల్ కోర్టు చీఫ్ జస్టిస్‌గా జో బైడెన్ నియమించారు. ఆమె 2007 సంవత్సరం నుంచి ఓక్లాండ్ కౌంటీ ఆరవ కోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. 2018లో సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా ఆమెను మిచిగన్ సుప్రీం కోర్టు నియమించింది. మిచిగాన్‌లో దక్షిణాసియా సంతతికి చెందిన మొదటి ఫెడరల్ న్యాయమూర్తి షాలినా అని వైట్ హౌస్ తెలిపింది.

షాలినా ప్రధాన న్యామూర్తి విధుతో పాటు సివిల్‌, క్రిమినల్‌ విషయాలను కూడా పరిశీలిస్తారని వైట్‌ హైస్‌ తెలిపింది. షాలినా 1993లో మిచిగాన్ విశ్వవిద్యాలయం, 1996లో డెట్రాయిట్ మెర్సీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయమూర్తి జీన్ష్నెల్జ్ పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి మిచిగాన్‌లోని ఓక్లాండ్ కౌంటీలోని 6వ సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా 2007లో షాలినా నియమితులయ్యారు.

చదవండి: బైడెన్‌ టీమ్‌ మరో భారతీయ మహిళా కిరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement