కనిపించని కళాఖండం తయారు చేసి జాక్‌పాట్‌ కొట్టేశాడు

Italian Artist Sells Invisible Sculpture For Over Rs 13 Lakh Became Viral - Sakshi

బ్రసిలియా: ఇటలీకి చెందిన 67 ఏళ్ల సాల్వటోర్ గారౌ కంటికి కనిపించని  కళాఖండం తయారు చేశాడు. ఆ కళాఖండం​ వేలానికి వేయగా అది 15వేల యూరోలకు( ఇండియన్‌ కరెన్సీలో రూ.13 లక్షలు) అమ్ముడుపోయింది. అలా సాల్వటోర్‌ కనిపించని‍ కళాఖండంతో జాక్‌పాట్‌ కొట్టేశాడు. కానీ సాల్వటోర్‌కు ఆ జాక్‌పాట్‌ దాని వల్ల రాలేదు.. అతని మాటల వల్ల వచ్చింది.

విషయంలోకి వెళితే.. సాల్వటోర్‌ స్వతహాగా మంచి శిల్పి. అతను తయారు చేసే వాటిలో పైకి ఏం కనిపించకపోయినా దానిలో ఒక పరమార్థం ఉంటుంది. తాజాగా అతను ''ఐయామ్‌'' అనే పేరిట కనిపించని ఒక కళాఖండాన్ని తయారు చేశాడు. కానీ అతను దానిని ప్రదర్శనకు ఉంచినప్పుడు అతను ఏం చూపెట్టాడో అక్కడ ఉన్నవాళ్లకు అర్థం కాలేదు. కాగా సాల్వటోర్‌ అతను తయారు చేసిన శిల్పం గురించి వివరించాడు.

''నిజానికి నేను అమ్మింది ఒక శూన్యం మాత్రమే.. అంటే ఖాళీదని అర్థం. ప్రపంచంలోని ఏ వస్తువుకు బరువు ఉండదు. నేను చూపించే ఈ వాక్యూమ్‌లోనూ గాలి తప్ప ఇంక ఏం ఉండదు. హైసెన్‌బర్గ్  సూత్రం ప్రకారం వాక్యూమ్ శక్తితో నిండిన వేగం తప్ప మరొకటి కాదని తెలుసుకున్నా. నా దృష్టి నుంచి చూస్తే విషయం మీకే అర్థమవుతుంది. ఉదాహరణకు మనం నమ్మే దేవుడికి రూపం ఉండడం మీరు గమనించారా.. ఇది అంతే నేను చెక్కిన ఈ శిల్పంలోనూ ఒక రూపం ఉంది. మనసు పెట్టి చూడండి.'' అని చెప్పుకొచ్చాడు. అతను చెప్పిన మాటలకు ఇ‍ంప్రెస్‌ అయిన నిర్వాహకులు అతని శిల్పాన్ని 15వేల యూరోలకు కొన్నారు.కానీ దీనిని టెస్టిఫై చేయాల్సి ఉంటుందని సదరు నిర్వాహకులు సాల్వటోర్‌కు తెలిపారు.
చదవండి: 12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్‌ వద్దకు ఎవరు రావొద్దు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top