12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్‌ వద్దకు ఎవరు రావొద్దు

12 Metre Long Minke Whale Washes Up People Warned Stay Away From Beach UK - Sakshi

లండన్‌: యూకేలోని టీసైడ్‌ నదీ తీరానికి మింక్‌ జాతికి చెందిన 12 అడుగుల భారీ తిమింగళం కొట్టుకువచ్చింది. ఈ విషయాన్ని బ్రిటీష్‌ అధికారులు గురువారం ధృవీకరించారు. ఆ భారీ తిమింగళం అవశేషాన్ని తొలగించేవరకు బీచ్‌ వద్దకు ప్రజలు ఎవరు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్రిటీష్‌ డైవర్స్‌ మెరైన్‌ లైఫ్‌ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది.

కాగా జూన్‌ 2న బీచ్‌కు వచ్చిన ఫియోనా రౌబోత్‌ అనే మహిళకు కొద్ది దూరంలో పెద్ద తిమింగళం కనిపించిదని.. కానీ అది చనిపోయిందని తెలిపింది.దానికి సంబంధించిన ఫోటోలను కూడా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. మహిళ షేర్‌ చేసిన ఫోటో ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు తిమింగళం మృతికి గల కారణాలను కూడా అన్వేషించే పనిలో పడ్డారు. కాగా  మింక్‌ జాతి తిమింగళాలు 9 నుంచి 10 అడుగుల పొడవు వరకు మాత్రమే ఉంటాయని వేల్‌ అండ్‌ డాల్ఫిన్‌ పరిరక్షణ కమిటీ పేర్కొంది. తాజాగా బయటపడిన 12 అడుగుల భారీ తిమింగళం మింక్‌ జాతిలో అతి పెద్దదని ఆ కమిటీ తెలిపింది.
చదవండి: జాలర్లకు జాక్​పాట్:​ దరిద్రం పోయి ఊరు బాగుపడింది

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top