‘వాళ్లు మనుషులు కాదు.. హింసే పైశాచిక ఆనందం’ | Sakshi
Sakshi News home page

Hamas Attackers: ‘వాళ్లు మనుషులు కాదు.. పెద్దగా నవ్వుతూ రాక్షస ఆనందం’

Published Sat, Jan 6 2024 6:09 PM

Israeli Witness Says Hamas Attackers laughed They Molestation Killed Woman - Sakshi

ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ దళాలను అంతమొందించడమే లక్ష్యంగా గాజాపై భీకర దాడులు చేస్తోంది. అక్టోబర్‌ 7న మొదటి సారి హమాస్‌ దళాలు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేయడంతో దానికి ప్రతిగా ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతోంది. అయితే యుద్ధం కారణంగా ఎందరో అమాయకులు బలయ్యారు. అనాగరికమైన హమాస్‌ దళాల కిరాతకమైన ప్రవర్తనను ఒక వారి దాడుల నుంచి బయటపడిన ఓ వ్యక్తి తాను ప్రత్యక్షంగా చూసిన హమాస్‌ ఆగడాలను ఓ మీడియా సంస్థకు తెలియజేశారు.

హమాస్‌ దాడుల నుంచి బయటపడిని రాజ్ కోహెన్.. తాను ప్రత్యక్షంగా చూసిన హమాస్‌కు సంబంధంచిన దారుణమైన ఘటనను వెల్లడించారు. ఒక మహిళను ఐదుగురు హమాస్‌ సాయుధులు పట్టుకొని.. ఆమెను చుట్టుముట్టారు. తర్వాత ఆమె బట్టలు విప్పి పైశాచిక ఆనందం పొందారు. అక్కడితో ఆగకుండా ఆమెపై ఒకరు అత్యాచారం చేసి మరీ కత్తితో దారుణంగా హత్య చేశారు. పశు ప్రవృత్తిగల ఆ వ్యక్తి మళ్లీ ఆ మహిళపై అత్యాచారం చేశాడని రాజ్‌ కోహెన్‌ ఒకింత బాధతో తెలిపారు.

వాళ్లు ఎప్పుడూ పెద్దగా నవ్వుతూ ఉంటారని అన్నారు. ఇలా పైశాచికంగా ‍ప్రవర్తించడం వారికి ఓ ఆనందమని అన్నారు. ఇదే పైశాచిక ఆనందం కోసం.. చాలా మందిని వారు పొట్టనపెట్టుకున్నారని తెలిపారు. బాధింపబడిన మహిళ మరో మహిళతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే.. ఆమె స్నేహితురాలను సైతం హమాస్‌ దళాలు చంపేశాయని రాజ్‌ తెలిపారు.

హమాస్‌ దళాలు తనపై కాల్పుల జరుగుతున్న సమయంలో పరుగెత్తుకుంటూ వారికంట కనబడకుండా ఓ పొదలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నానని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో హమాస్‌ చేతిలో 1200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతిచెందగా.. ప్రతిగా ఇజ్రాయెల్‌ గాజాపై చేసిన దాడుల్లో 22000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.

చదవండి:  విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్‌.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement