నాలుగో రోజూ గాజాపై ఇజ్రాయెల్‌ దాడి.. 27 మంది మృతి | Israel Attacks Gaza On Fourth Consecutive Day | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ గాజాపై ఇజ్రాయెల్‌ దాడి.. 27 మంది మృతి

Jul 10 2024 9:56 AM | Updated on Jul 10 2024 10:04 AM

Israel Attacks Gaza On Fourth Consecutive Day

ఇజ్రాయెల్‌ తన దాడులతో గాజాపై మరోమారు విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని పాలస్తీనా భూభాగంలోగల ఒక పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఈ దాడులలో 27 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు పాలస్తీనియన్లు ఈ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.

నాలుగు రోజులుగా గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌ దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌కు సమీపంలోని అబాసన్‌లోని అల్-అవ్దా పాఠశాల గేట్ వద్ద ఈ దాడి జరిగింది. గతంలో జరిగిన మూడు దాడులకు తామే బాధ్యులమంటూ ఇజ్రాయెల్ పేర్కొంది. పాఠశాలలో దాక్కున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మూడు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే సైనిక అవసరాల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు ఇతర పౌర సౌకర్యాలను ఉపయోగిస్తున్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement