ఆ ఇరాన్‌ యువతి మృతి | Iranian teenager attacked for not wearing hijab on train dies | Sakshi
Sakshi News home page

ఆ ఇరాన్‌ యువతి మృతి

Published Sun, Oct 29 2023 5:01 AM | Last Updated on Sun, Oct 29 2023 5:01 AM

Iranian teenager attacked for not wearing hijab on train dies - Sakshi

దుబాయ్‌: ఇరాన్‌లో కొద్ది వారాల కింద హిజాబ్‌ ధరించకుండా మెట్రో రైల్లో ప్రయాణిస్తూ అంతుబట్టని రీతిలో తీవ్ర గాయాలపాలైన టీనేజ్‌ యువతి మరణించింది. కొద్ది రోజుల కోమా అనంతరం ఆమె తుదిశ్వాస విడిచినట్టు ప్రభుత్వ మీడియా శనివారం ఈ మేరకు వెల్లడించింది. అరి్మత గెర్వాండ్‌ అనే ఆ యువతి అక్టోబర్‌ 1న టెహ్రాన్‌లో మెట్రోలో ప్రయాణిస్తూ గాయపడింది. ఆమె ట్రైన్‌లోంచి ప్లాట్‌ఫాంపైకి వచ్చి పడుతున్న వీడియో బయటికి వచి్చంది.

మెట్రోలో ఏమైందో ఇప్పటిదాకా బయటికి రాలేదు. హిజాబ్‌ ధరించనందుకే పోలీసులు ఆమెకు ఈ గతి పట్టించి ఉంటారని హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఏడాది కింద ఇలాగే హిజాబ్‌ ధరించనందుకు 22 ఏళ్ల మహ్సా అమినీని మోరల్‌ పోలీసులు తీవ్రంగా కొట్టడం, ఆమె జైల్లో మరణించడం, దానిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెర్వాండ్‌ మృతితో మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement