ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ మళ్లీ మూసివేత | Iran Closed Hormuz Strait After Ceasefire | Sakshi
Sakshi News home page

Hormuz Strait: హర్మూజ్‌ని మళ్లీ మూసేసిన ఇరాన్.. అదే కారణం

Apr 8 2026 10:43 PM | Updated on Apr 8 2026 11:16 PM

Iran Closed Hormuz Strait After Ceasefire

ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారానికల్లా ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకునిపోతుందని హెచ్చరించిన ట్రంప్.. చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్‌కి పెట్టిన డెడ్‌లైన్‌కి సరిగ్గా గంటన్నర ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండు వారాల పాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈ లోపు శాంతి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చినప్పటికీ లెబనాన్‌ని ఒప్పందంలో చేర్చలేదని తెలిపింది.ఈ క్రమంలోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దారుణంగా విరుచుకుపడింది. 10 నిమిషాల్లోనే 100కి పైగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు చనిపోగా, వేలమంది గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఇజ్రాయెల్‌ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే హెచ్చరించింది. లెబనాన్‌పై దాడులు ఆపకపోతే టెల్‌ అవీవ్‌‌పై  దాడి చేస్తామని హెచ్చరించింది.  ప్రస్తుతం సీజ్‌ఫైర్‌ ఒప్పందం కేవలం ఇరాన్‌పై దాడికి సంబంధించింది మాత్రమేనని లెబనాన్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్.. మళ్లీ హర్మూజ్‌ని మూసేవేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement