Indonesia Tsunami Alert: ఇండోనేషియలో భారీ భూకంపం

Indonesia tsunami warning above 7 Magnitude Earthquake Flores Island - Sakshi

జకార్తా: సునామీ అలెర్ట్‌తో ఇండోనేషియా తీర ప్రాంతం గజగజలాడింది. మంగళవారం ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకోవటంతో ఇండోనేషియా సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఏడాది మే నెలలో కూడా సుమత్రా ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం చోటు చేసుకున్న భారీ భూకంపంతో ఇండోనేషియా ప్రజలు వణికిపోతున్నారు.

చదవండి:  దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్‌ పాజిటివ్‌

గతంలో 26 డిసెంబర్ 2004లో ఇండోనేషియా సముద్రతీరంలో వచ్చిన భూకంపం.. సునామీగా మారటంతో దేశం అల్లకలోక్లమైన విషయం తెలిసిందే. వాయువ్య సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్ మరో తొమ్మిది దేశాల్లో బీభత్సం సృష్టించింది. అప్పటి సునామి పలు దేశాల్లో వేల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం చోటు చేసుకున్న భారీ భూకంపం 2004 సునామీని రిపీట్‌ చేస్తుందా? అనే ఆందోళనలో ఇండోనేషియా ప్రజలు భయపడిపోతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top