‘కరోనా’ మూలాలపై అన్వేషణ!

Indian scientist to join WHO expert group to determine origin of covid - Sakshi

డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో మరో బృందం

భారత శాస్త్రవేత్త రామన్‌ గంగఖేడ్కర్‌కు చోటు

జెనీవా: భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మూలాలను కనుక్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకయిందా? లేక సహజ సిద్ధంగానే సంక్రమించిందా? అన్న దిశగా ఇప్పటి వరకు జరిపిన విచారణ అసంపూర్తిగా ముగిసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ వైరస్‌ల గుట్టుని నిగ్గు తేల్చడానికి శాస్త్రవేత్తల బృందాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటు చేసింది.

ఈ బృందం కరోనా వైరస్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న వైరస్‌ల పుట్టుకపై అధ్యయనం చేయనుంది. అంతేకాకుండా ఈ తరహా వైరస్‌ల పుట్టుకపై అధ్యయనాలు ఎలా చేయాలో సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు కొన్ని మార్గదర్శకాలను సైతం రూపొందిస్తుంది. ఈ బృందంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 700 దరఖాస్తులు రాగా, అందులో 25 పేర్లను డబ్ల్యూహెచ్‌ఓ ఎంపిక చేసింది. బృంద సభ్యుల పేర్లతో త్వరలో తుది జాబితాను వెల్లడించనుంది.

ఇదే ఆఖరి అవకాశం
డబ్ల్యూహెచ్‌ఓ సైంటిఫిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఫర్‌ ది ఆరిజన్స్‌ ఆఫ్‌ నోవెల్‌ పాథోజెన్స్‌(సాగో) అని పిలిచే ఈ ప్రతిపాదిత బృందంలో ఒక భారతీయ శాస్త్రవేత్తకి సైతం చోటు లభించడం విశేషం. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నుంచి గత ఏడాదే పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్త డాక్టర్‌ రామన్‌ గంగఖేడ్కర్‌ డబ్ల్యూహెచ్‌ఓ బృందంలో పని చేసే అవకాశం ఉంది. అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టే నిపుణుడిగా రామన్‌కు పేరుంది. ఐసీఎంఆర్‌లో పనిచేస్తూ రెండేళ్ల పాటు నిఫా వైరస్, కరోనా వైరస్‌లను ఎదుర్కోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై ఆయన చేసిన పరిశోధనలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

కరోనాతో పాటు వివిధ వైరస్‌ల గుట్టుమట్లను తెలుసుకునేందుకు సైంటిస్టులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్న డబ్ల్యూహెచ్‌ఓ వారిచ్చే సూచనల మేరకు నడుచుకోనుంది. కరోనా వైరస్‌ మూలాలను కనుక్కోవడానికి ఇదే ఆఖరి అవకాశం అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ అధా్నమ్‌ ఘెబ్రాయసిస్‌ అన్నారు. గత బృందంలో సభ్యులుగా ఉండి, చైనాలో పర్యటించిన ఆరుగురు శాస్త్రవేత్తలకు ఈసారి కూడా చోటు కల్పించారు. కాగా డబ్ల్యూహెచ్‌ఓ విచారణలో ఏమైనా రాజకీయపరమైన అవకతవకలు జరిగితే సహించేది లేదని చైనా హెచ్చరించింది. డబ్ల్యూహెచ్‌ఓ బృందానికి శాస్త్రీయంగా మద్దతు ఇస్తామే తప్ప రాజకీయం చేస్తే ఊరుకోబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ తేల్చి చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-10-2021
Oct 14, 2021, 07:26 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సాధారణ ప్రజలతో పోలిస్తే గిరిజనులు కోవిడ్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌...
13-10-2021
Oct 13, 2021, 04:28 IST
గార : ఈ నెల 14వ తేదీ గురువారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ 100 కోట్ల డోసులు పూర్తవుతున్న...
12-10-2021
Oct 12, 2021, 14:22 IST
2, 3 దశల్లో 20 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల వ్యాక్సిన్‌ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు
12-10-2021
Oct 12, 2021, 07:49 IST
రాష్ట్రంలో 25 లక్షల మంది మొదటి డోసు తీసుకుని గడువు దాటినా రెండో డోసు తీసుకోలేదు.
09-10-2021
Oct 09, 2021, 06:28 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ఉద్యోగులు ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ఢిల్లీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అక్టోబర్‌ 16 తర్వాత...
08-10-2021
Oct 08, 2021, 20:04 IST
కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
08-10-2021
Oct 08, 2021, 06:21 IST
పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో కోవిడ్‌ కేసులు మళ్లీ పెరిగే ప్రమాదముందని ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం...
06-10-2021
Oct 06, 2021, 06:51 IST
వాషింగ్టన్‌: ప్రపంచానికి కరోనా మహమ్మారిని పరిచయం చేయడానికంటే చాలా నెలలకు ముందే చైనా ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిపెట్టిందనే బలమైన...
02-10-2021
Oct 02, 2021, 07:58 IST
కరోనాపై చేస్తున్న యుద్ధానికి మాత్ర రూపంలో మరో ఆయుధం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
29-09-2021
Sep 29, 2021, 16:17 IST
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా రేపిన కలకలం ఇప్పట్లో ఆగిపోయేలా లేదు. కోవిడ్‌ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా,...
29-09-2021
Sep 29, 2021, 07:17 IST
Covid 19 Latest Updates వైరస్‌ అదుపులో మనిషి ఉండకుండా, మనిషి అదుపులో వైరస్‌ ఉండే పరిస్థితిన సాధించాలని సంస్థ...
27-09-2021
Sep 27, 2021, 16:15 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 618 మందికి...
27-09-2021
Sep 27, 2021, 07:49 IST
ధార్‌: దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. నిత్యం లక్షలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. అయితే, ప్రధానమంత్రి...
25-09-2021
Sep 25, 2021, 16:32 IST
దేశంలో ఇకపై రోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు, వేల మరణాలు ఉండకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్, వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ...
22-09-2021
Sep 22, 2021, 09:02 IST
హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ 18 ఏళ్లలోపు వారికి ఇచ్చే కోవాగ్జిన్‌ టీకా ఫేజ్‌ 2/3 ట్రయల్స్‌ పూర్తి...
21-09-2021
Sep 21, 2021, 11:07 IST
డెల్టా–1 నుంచి డెల్టా–25 వరకు గుర్తించిన అన్ని మ్యూటేషన్లలో డెల్టా–4 అనే మ్యూటేషన్‌ చాలా వేగంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ...
21-09-2021
Sep 21, 2021, 02:45 IST
వేషము మార్చెను, భాషను మార్చెను, చివరకు తానే మారెను... అని మనిషి పోకడను ఒక సినీ కవి వర్ణించాడు. ప్రస్తుతం...
20-09-2021
Sep 20, 2021, 10:54 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 30,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర...
17-09-2021
Sep 17, 2021, 07:48 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో గర్భిణులకు అధికంగా ముప్పు ఉండే అవకాశాలున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తాజా...
17-09-2021
Sep 17, 2021, 06:18 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థర్డ్‌ వేవ్‌ ముప్పు ఇంక ఉండదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ... 

Read also in:
Back to Top