ఐరాస అవార్డుకు ఎంపికైన భారతీయుడు | Indian entrepreneur Vidyut Mohan Winner to Young Champions of the Earth | Sakshi
Sakshi News home page

ఐరాస అవార్డుకు ఎంపికైన భారతీయుడు

Published Fri, Dec 18 2020 5:54 AM | Last Updated on Fri, Dec 18 2020 5:54 AM

Indian entrepreneur Vidyut Mohan Winner to Young Champions of the Earth  - Sakshi

ఐక్యరాజ్యసమితి: పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి సృజనాత్మక పరిష్కారాలను సూచించే వారికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రకటించే ‘యంగ్‌ చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌–2020’ విజేతల్లో భారత్‌కు చెందిన విద్యుత్‌ మోహన్‌ (29) కూడా నిలిచారు. ఈ అవార్డుకు మొత్తం ఏడు మంది ఎంపికయ్యారు. వృత్తిరీత్యా ఇంజినీర్‌ అయిన విద్యుత్‌.. మిగిలిపోయిన పంటను ప్రత్యేక పద్ధతిలో కాల్చడం ద్వారా రైతులకు ఆదాయం చేకూరే విధానాన్ని గురించి ప్రచారం చేసినందుకుగానూ ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. పంటను యాక్టివేటెడ్‌ కార్బన్‌లుగా మార్చి వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ప్రచారం చేశాడు. పేదలకు ఆదాయం వచ్చే మార్గాల గురించి చెప్పడం తనకు ఇష్టమని విద్యుత్‌ అన్నారు. కరోనాతో ప్రపంచం బాధపడుతున్న వేళ పర్యావరణహితం కోరి ఈ ఏడు మంది చేసిన ప్రయత్నాలకు ఈ అవార్డును ప్రకటించినట్లు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement