ఇండియన్‌ అమెరికన్ల ఓట్లన్నీ నాకే

Indian Americans would be voting for me says Donald Trump - Sakshi

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇండియన్‌ అమెరికన్‌ ఓటర్లపై గాలం వేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు తనకే ఉంటుందని ప్రకటించారు. అమెరికాలో భారతీయుల ఓట్లన్నీ తనకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇండియన్‌ అమెరికన్‌ ఓట్ల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘భారత్‌ మాకు ఎంతగానో సహకరిస్తోంది. ప్రధాని మోదీ మాకు గట్టి మద్దతుదారు. ప్రవాస భారతీయుల ఓట్లన్నీ మాకే వస్తాయన్న విశ్వాసం ఉంది’అని పేర్కొన్నారు.

భారత్‌ అంటే అందరికీ అభిమానం
తమ కుటుంబంలో అందరికీ భారతదేశం పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయని ట్రంప్‌ చెప్పారు. తన కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్, అతని స్నేహితురాలు కింబర్లీలకు భారతీయుల్లో మంచి పేరు ఉందని ఉన్నారు. వారంతా భారత్‌ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, అందుకే తనకి కూడా ఆ దేశం అంటే ఎంతో అభిమానమని వెల్లడించారు. భారతీయుల సెంటిమెంట్లు తనకెంతో నచ్చుతాయన్న ట్రంప్‌ ఇండియన్‌ అమెరికన్ల ఓట్ల కోసం వారు ముగ్గురూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top