పాక్‌లో అరెస్టు భయం..పరుగులు తీస్తున్న మాజీ మంత్రి

Imran Khans Aide Fawad Chaudhry Runs Into Court Fearing Arrest - Sakshi

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌​ అరెస్టుతో పాకిస్తాన్‌ ఒక్కసారిగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ మద్దతుదారులు హింసాత్మక నిరసనలకు గానూ ఇమ్రాన్‌ ఖాన్‌ సహాయకుడు, పాక్‌ మాజీ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ చౌదరిని మెయింటెనెన్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఆర్డర్‌ రెగ్యులేషన్‌ కింద నిర్బంధించారు. ఆ తర్వాత ఆయన తాను నిర్దోషినంటూ ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీంతో హైకోర్టు న్యాయమూర్తి మియాంగుల్‌ హసన్‌ ఔరంగ్‌జేబ్‌ అతని పిటిషన్‌ విచారిస్తూ.. హింసాత్మక నిరసనలో పాల్గొనని లేదా ప్రేరేపించనని హామీ పతం‍్రం సమర్పించిన తదనంతరం అతన్ని విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో చౌదరి ఉత్తర్వు జారీ చేసేంత వరకు వేచి ఉండాల్సిన పని లేకుండా సులభంగా బయటపడే మార్గం సుగమం అయ్యింది.

ఈ మేరకు ఆయన ఇంటికి వెళ్లే క్రమంలో తన ఎస్‌యూవీ వద్దకు రాగానే సరిగ్గా పోలీసుల ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా కారు వెనుక వైపుకి పరుగులు తీస్తూ తిరిగి కోర్టులోకి వెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామానికి ఆయనకు ఆయాసం,ఊపిరి పీల్చుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ తర్వాత కోర్టులో న్యాయమూర్తి ఔరంగజేబు ఎదుట కోర్టు బెయిల్‌ ఇచ్చినప్పటికీ పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని వాపోయారు. మీరు వ్రాతపూర్వక ఉత్తర్వు కోసం వచ్చేంత వరకు ఆగాల్సిందేనని పోలీసులకు సూచించడంతో మంత్రికి భారీ ఉపశమనం లభించినట్లయింది. ఏ సందర్భంలోనూ చౌదరిని అరెస్టు చేయకుండా న్యాయమూర్తి అధికారులను గట్టిగా ఆదేశించారు. 

(చదవండి: వంటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ..ఏకంగా వంద గంటల పాటు..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top