పది గ్రామాలను ఖాళీ చేయించిన రష్యా

Huge Blaze Breaks Out at Munitions Depot in Russia Ryazan Region - Sakshi

మాస్కో: రష్యాలో మందు గుండు సామాగ్రి డిపోలో భారీ మంటలు చెలరేగాయి. మాస్కోకు ఆగ్నేయంగా ఉన్న రియాజాన్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. దాంతో అధికారులు రియాజాన్‌ చుట్ట పక్కల ఉన్న 10 గ్రామాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది. నివేదికల ప్రకారం ఆర్మ్స్‌ డిపో సమీపంలో మందపాటి పొగ గాలిలో పైకి లేవడాన్ని చూడవచ్చు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో బూడిద ఆకాశం నుంచి పడటం గమనించవచ్చు. సమీప పొలంలోని మంటలు గాలి ప్రసారం వల్ల డిపోకి తగలడంతో మంటలు చెలరేగినట్లు రష్యా మిలిటరీ టాస్‌(టీఏఎస్‌ఎస్‌) వార్తా సంస్థ పేర్కొంది. (చదవండి: బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం)

ఈ ఘటనలో ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ సంభవించినట్లు నివేదికలు లేవు. ఇక ఈ ప్రమాదంపై రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ స్పందించింది. ప్రమాదం సంభవించిన మోటారు మార్గాన్ని మూసి వేస్తున్నామని.. చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల మేర 10 గ్రామాలను ఖాళీ చేయించామని తెలిపింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top