వారిపై జీవితాంతం నిషేధం విధించండి! | Half Eaten Pizza Gone Viral On Social Media | Sakshi
Sakshi News home page

వారిపై జీవితాంతం నిషేధం విధించండి!

Nov 2 2020 4:47 PM | Updated on Nov 2 2020 4:50 PM

Half Eaten Pizza Gone Viral On Social Media - Sakshi

సగం తిన్న పిజ్జా

పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దాని రుచికి ఫిదా అవ్వని వారు లేరంటే అతిశయోక్తి కాదు!. రోజుకు ఒక పిజ్జా అయినా తినే వారు ఉండనే ఉన్నారు. అయితే పిజ్జా లవర్స్‌ను ఓ ఫొటో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. సగం తిన్న ఆ పిజ్జా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పిజ్జా లోపల బాగాన్ని తినేసి, చుట్టూరా ఉన్న ప్రదేశాన్ని వదిలేశారు. దాన్ని ఫొటో తీసి హెచ్‌సీ సౌర్‌డో పిజ్జా అనే ట్విటర్‌ ఖాతాలో ఉంచారు. ( ‘జాదూకీ జప్పీ’.. హ్యాట్సాఫ్‌ డాక్టర్‌! )

‘2020, మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు?’ అనే శీర్షికను ఉంచారు. దీనిపై పిజ్జా అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘‘వారిని కనిపెట్టి, పిజ్జా తినకుండా జీవితాంతం వారిపై నిషేధం విధించండి... అది చట్టరిత్యా నేరం... పిజ్జాను కత్తి, పోర్క్‌‌తో తినే వారిని ఎప్పటికీ నమ్మకండి’’ అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement