లాక్‌డౌన్‌లో ప్రజలకు ఎంత జుట్టు పెరిగిందో చెప్పేందుకే..!

Hairdresser Collects Waste Hair Makes A FIVE Feet Boris Johnson Mural Out Of It - Sakshi

జుట్టుతో  చిత్రాలను రూపొందించడం తెలుసా? అది కూడా.. లాక్‌డౌన్‌లో ప్రజలకు ఎంత జట్టు పెరిగిందో చెప్పేందుకు ఒక దేశ ప్రధాని చిత్రాన్ని జుట్టు వ్యర్థాలతో రూపకల్పన..

మనం చాలా రకాలుగా చిత్రాలను గీయడం చూశాం. కానీ జుట్టుతో  చిత్రాలను రూపొందించడం తెలుసా? అది కూడా యూకే బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ చిత్రాన్ని రూపొందించింది. అసలు ఎవరు ఈ చిత్రాన్ని రూపొందించారు ఎక్కడ ఏంటో చూద్దాం రండి.

(చదవండి: ప్లీజ్‌ అంకుల్‌ నన్ను కూడా టెస్ట్‌ చేయండి)

వివరాల్లోకెళ్లితే.....కోవిడ్‌ 19 విపత్కర సమయాల్లో తనదైన వ్యూహంతో దేశాన్ని సమర్ధవంతంగా నడిపించిన బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌కు కృతజ్ఞతలు తెలిపే నిమిత్తం డేవినియా ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ మేరకు  సోమర్‌సెట్‌లో సెలూన్‌ను నడుపుతున్న డావినియా సెలూన్‌లో సేకరించిన జుట్టు వ్యర్థాలతో  5 అడుగుల బోరిస్‌ జాన్సన్‌ చిత్రాన్ని రూపొందించింది.

అయితే ఆమె ఈ పనిని కేవలం రెండు రోజుల్లో పూర్తి చేసింది. ఈ మేరకు డేవినియా మాట్లాడుతూ.... లాక్‌డౌన్‌లలో ప్రజల జుట్టు ఎంత పెరిగిందో చెప్పేందుకు ఈ చిత్రం ఒకరకరంగా దోహదపడుతుంది. అంతేకాదు ఈ లాక్‌డౌన్‌ వేళ సెలున్‌ల ప్రాముఖ్యతను ప్రజలందరు గుర్తించారు. ఈ కుడ్యచిత్రాన్ని బోరిస్‌ వ్యక్తిగతంగా వీక్షించాలని కోరుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చింది. 

(చదవండి: కుక్కతో చిరుత స్నేహం.. వీడియో వైరల్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top