ఆలోపు జీవిత భాగస్వామిని ఎంచుకో.. లేదంటే ఒంటరిగా చావాలి!

Girl Shares Conversations With Grandfather On TikTok Viral On Social Media - Sakshi

టిక్ టాక్‌ వీడియోలంటే అందరికీ గుర్తుకు వచ్చేంది తమలోని కళలను బయటపెట్టడం. డ్యాన్స్‌లు, పాటలు, డైలాగ్‌లు ఇలా అన్ని రంగాల్లో టిక్‌టాక్‌ వీడియోలు చేసి తమ ప్రతిభతో పాపులర్‌ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా ఓ టిక్‌టాక్‌ వీడియో ఇందుకు భిన్నంగా ఉండటంతో సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారింది. ఓ తాత, మనవరాలు మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో అది. మేగాన్ అనే ఓ అమ్మాయికి తన తాత ఫోన్‌లో చాటింగ్‌ చేస్తూ.. ఆమెకు చాలా సరదా సూచనలు, జాగ్రత్తలు చేప్పారు. 91 ఏళ్ల ఈ తాత తన గారాల మనవరాలుతో.. ‘29 ఏళ్ల లోపు జీవిత భాగస్వామని ఎంచుకోని అమ్మాయి.. ఇక ఒంటరిగానే జీవితాన్ని ముగిస్తుందని ఓ న్యూస్‌ ఆర్టికల్‌ చదివాను. ఇంకో మూడు నెలలకు నీ బర్త్‌ డే వస్తుంది. ఈ విషయాన్ని నీకు తెలియజేయాలనుకుంటున్నా’ అని ఫోన్‌లో సరదాగా సందేశం పంపారు.

మరో సందేశంలో.. ‘మేగాన్‌, నువ్వు బరువు తగ్గుతున్నావని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన కుటుంబ సభ్యలు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు’ అని అన్నారు. మరో ఫోన్‌ సందేశంలో.. ‘హాయ్ మేగాన్‌. నువ్వు అధికంగా తాగడంలేదని అనుకుంటున్నా. ఎందుకంటే మద్యం ధరలు ఆకాశానంటుతున్నట్లు న్యూస్‌ చదివి తెలుసుకున్నా’ అని చాలా ఫన్నిగా చెబుతాడు. దానికి మేగాన్‌ స్పందిస్తూ.. ‘నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటా తాత’ అని రిప్లై ఇస్తారు. అయితే తన తాతతో జరిగిన సరదా సంభాషణకు సంబంధించి మొబైల్‌ చాటింగ్‌ స్క్రీన్‌ షాట్లతో మేగాన్‌ టిక్‌టాక్‌ వీడియో తయారు చేశారు. ఆ వీడియోను ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరి సంభాషణ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘తాత, మనవరాలు అంటే ఇలా ఉండాలి’.. ‘91 ఏళ్ల ఓ తాత తన మనవరాలకు ప్రస్తుత కాలంతో వివాహానికి సంబంధించిన ఫన్నీ సూచనలు అద్భుతం’.. ‘అంత సరదాగా మాట్లాడే తాత ఉండటం ఆమె అదృష్టం​’.. అని నెటిజన్‌లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top