‘లివ్‌ ఇన్‌’లో ఉండాలంటే.. ఆ యువతి కండీషన్లకు నెటిజన్లు గగ్గోలు!

girl made strict rules for her boyfriend to live together - Sakshi

ఒక యువతి తన పార్ట్‌నర్‌తో లివ్‌ ఇన్‌లో ఉండేందుకు అతని ముందు ఉంచిన షరతుల లిస్టు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీటినన్నింటినీ నెరవేరుస్తానని హామీ ఇస్తేనే లివ్‌ ఇన్‌లో ఉంటానని, లేని పక్షంలో బైబై టాటా చేప్పేస్తానని బెదిరించింది.

ఎవరైనా మరొకరికితో కలసి ఉండాలంటే కాస్తయినా సద్దుకుపోవాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. స్కూలులో స్నేహితులతో, కాలేజీలో రూమ్‌ మేట్స్‌తో సద్దుకుపోతూ కలసిమెలసి ఉండటం అనేది అందరికీ అనుభవమే. అయితే ఇప్పుడు కాలం మారింది. పెళ్లికి ముందు లేదా పెళ్లి ఊసే లేకుండా లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో యువతీయువకులు ఉంటున్నారు. ఇలా ఉంటున్నవారిలో చాలామంది పరస్పరం అడ్జెస్ట్‌ కాలేక విడిపోతున్నారు.  

వివాహం అయినవారు ఒకరి ఇష్టాఇష్టాలు, అభిరుచులు ఎలా ఉన్నా ఒకరితో మరొకరు అడ్జెస్ట్‌ అవుతున్నారు. అలాగే భాగస్వామి కోసం తమ ఇష్టాఇష్టాలను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పటి యువత భాగస్వామితో అస్సలు అడ్జెస్‌ అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. తాజాగా ఒక లివ్‌ ఇన్‌ జంటకు సంబంధించిన ఉదంతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

లివ్‌ ఇన్‌లో ఉండేందుకు..
‘ది మిర్రర్‌’ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన పార్ట్‌నర్‌తో పాటు లివ్‌ ఇన్‌లో ఉండేందుకు కొన్ని షరతులు విధించింది. ఈ షరతులకు అంగీకరించకపోతే బ్రేకప్‌ చెప్పేస్తానని బెదిరించింది. ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు లివ్‌ ఇన్‌ కోసం ఉంచిన షరతులను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తాను విధించిన నియమాలను తాను కూడా పాటిస్తానని, అదేవిధంగా తన బాయ్‌ ఫ్రెండ్‌ కూడా పాటించాలని 
స్పష్టం చేసింది.

యువతి పెట్టిన నిబంధనలివే..
ఆ యువతి విధించిన కండీషన్లలో మొదటిది తన బాయ్‌ ఫ్రెండ్‌ అతని సామాన్లతో సహా విడిగా వేరే గదిలో ఉండాలి. రెండవ నియమం.. డైనింగ్‌ టేబుల్‌ మొదలుకొని ఇంటిలో ఎక్కడా చెత్తపోయకూడదు. అపరిశుభ్రంగా మార్చకూడదు. మూడవ నియమం.. ఇంటిలోని న్యూస్‌ పేపర్లు, ఇతర కాగితాలు సరిగా సద్దుకొని అతని గదిలోనే ఉంచుకోవాలి. ఈ షరతులను చూసి నెటిజన్లు కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. ఒక యూజర్‌.. లివ్‌ ఇన్‌లో ఉండేందుకు ఎటువంటి షరతులు ఉండకూడదని రాయగా,మరో యూజర్‌ లివ్‌ ఇన్‌లో ఇలాంటి తీరు అస్సలు పనికిరాదని రాశారు. ఇంకో యూజర్‌ సరైన జీవితం గడిపేందుకు ఆ యువతి పెట్టిన కండీషన్లలో తప్పేముందని ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: ‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్‌ టీచర్‌.. చూసేందుకు జనం పరుగులు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top