వైరల్‌ వీడియో: బంగ్లాదేశ్‌లో భూకంపం.. భారత్‌ ప్రకంపనలు | Geological Survey Says Earthquake In Bangladesh | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: బంగ్లాదేశ్‌లో భూకంపం.. భారత్‌ ప్రకంపనలు

Nov 21 2025 12:06 PM | Updated on Nov 21 2025 12:54 PM

Geological Survey Says Earthquake In Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. బంగ్లా రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (US Geological Survey) తెలిపింది. బంగ్లాలో భూకంపం ధాటికి కోల్‌కతా (Kolkata) సహా ఉత్తర భారతంలో (Northeast India) ప్రకంపనలు నమోదయ్యాయి.

వివరాల ప్రకారం.. బంగ్లా రాజధాని ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్‌డిలో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.  పేర్కొంది. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఈ ప్రకంపనల ధాటికి భారత్‌లోనూ భూమి కంపించింది. కోల్‌కతా (Kolkata) సహా ఉత్తర భారతంలో (Northeast India) ప్రకంపనలు నమోదయ్యాయి. కోల్‌కతాలో ఉదయం 10:10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌, దక్షిణ్‌, ఉత్తర దినాజ్‌పూర్‌ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గువాహటి, అగర్తల, షిల్లాంట్‌ వంటి నగరాల్లోనూ భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.

మరోవైపు.. ఈ భూకంపం కారణంగా బంగ్లాదేశ్‌-ఐర్లాండ్‌ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ప్రకంపనలతో కొన్ని నిమిషాల పాటు మ్యాచ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత కొనసాగించారు. అయితే, ఈ విపత్తులో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement