రయ్‌మని గాల్లో ఎగిరిన కారు..ధర ఎంతంటే.. | Flying Car Test Success In California | Sakshi
Sakshi News home page

రయ్‌మని గాల్లో ఎగిరిన కారు..ధర ఎంతంటే..

Feb 23 2025 1:41 PM | Updated on Feb 23 2025 2:18 PM

Flying Car Test Success In California

కాలిఫోర్నియా:ప్రపంచంలోని అన్ని టాప్‌ సిటీల్లో నివసించే వారికి ఒకటే ప్రధాన సమస్య. ఉదయం ఆఫీసులకు వెళ్దామంటే రోడ్లపై కదలకుండా చేసి చిరాకు తెప్పించే ట్రాఫిక్‌. ఈ పద్మవ్యూహాన్ని తప్పించుకుని హాయిగా గాలిలో ఎగురుకుంటూ వెళ్లేందుకు ఎగిరే  కార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

ఇలాంటి ఎగిరే కారును ఒకదానిని అమెరికా కాలిఫోర్నియాలోని రోడ్లపై పరీక్షించింది వాటిని తయారు చేసిన కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్‌.టెస్ట్‌లో భాగంగా నలుపు రంగులో ఉన్న ఓ ఎగిరే కారు తొలుత మామూలు కారులానే రోడ్డుపై రయ్‌మని దూసుకెళ్లింది.ఇలా వెళ్లిన కొద్ది సేపటికి కారు హెలికాప్టర్‌లా నిట్టనిలువునా గాల్లోకి లేచి ఎగురుకుంటూ వెళ్లింది. 

ఈ పరీక్ష విజయవంతమైనట్లు కంపెనీ ప్రకటించింది. పరీక్ష సమయంలో రోడ్డుపై ఎవరు లేకుండా కారు ఎగిరే ప్రదేశంలో ఏవీ అడ్డు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలెఫ్‌ ఏరోనాటిక్స్‌ తయారు చేసిన విద్యుత్‌తో నడిచే ఎగిరేకారు ధర ఒక్కోటి 30వేల డాలర్లు.కంపెనీకి కస్టమర్ల నుంచి 3వేల కార్లకు ఇప్పటికే ఆర్డర్లు వచ్చాయి.నలుగురు కూర్చొని వెళ్లగలిగే 200 కిలోమీటర్లు గాలిలో ఎగిరే రేంజ్‌, 400 కిలో మీటర్లు రోడ్డు రేంజ్‌ ఉన్న మోడల్‌ జెడ్‌ సెడాన్‌ కారు 2035కల్లా అందుబాటులోకి తీసుకురానున్నారు,.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement