వైరల్‌: మృగాళ్ల బారి నుంచి బాలికను కాపాడిన సింహాలు | Sakshi
Sakshi News home page

వైరల్‌: మృగాళ్ల బారి నుంచి బాలికను కాపాడిన సింహాలు

Published Mon, Apr 26 2021 8:12 PM

Ethiopian Lions Rescue Girl Kidnapped For Marriage - Sakshi

అడ్డిస్‌బాబా: బుద్ధి, జ్ఞానం విచక్షణా శక్తి ఉన్న మనుషులు మృగాళ్లలా మారినా వేళ.. నోరు లేని మూగ జీవాలు మానవత్వం చూపాయి. ఓ చిన్నారి జీవితాన్ని నాశనం చేయడననికి ప్రయత్నించిన మృగాళ్ల బారీ నుంచి మృగరాజుల కాపాడాయి. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఆఫ్రికా ఖండం, ఇథోపియా దేశ రాజ‌ధాని అడ్డిస్ బాబా అనే ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక  కిడ్నాప్‌కు గురైంది. త‌న కుమార్తె క‌నిపించ‌డం లేదంటూ బాధితురాలి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌ల్ని ముమ్మ‌రం చేశారు. మరోవైపు కిడ్నాప‌ర్లు బాలిక‌ను చిత్రహింస‌ల‌కు గురిచేశారు. లైంగికంగా వేధించి బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా, బాలిక  కిడ్నాపర్ల చెర నుంచి త‌ప్పించుకొని స్థానికంగా ఉన్న ఓ అడ‌విలోకి వెళ్లింది.

చిన్నారి జాడ కోసం కిడ్నాప‌ర్లు అడ‌విలోకి వెళ్లారు. అలా స‌గం దూరం అడ‌విలోకి వెళ్లిన బాలిక‌కు సింహాలు అండ‌గా నిలిచాయి. ఓ చెట్టుకింద 3 సింహాలు కిడ్నాప‌ర్ల  నుంచి ర‌క్షించేందుకు బాధితురాల్ని రౌండ‌ప్ చేశాయి. దీంతో కిడ్నాప‌ర్లు గుండెల్ని అర‌చేతిలో పెట్టుకొని బ్ర‌తుకు జీవుడా అంటూ అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. కాగా గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్న పోలీసులు కిడ్నాపర్ల‌ను అదుపులోకి తీసుకుని త‌మ‌దైన స్టైల్లో విచార‌ణ చేప‌ట్టారు.  విచార‌ణ‌లో చిన్నారి సుర‌క్షితంగా ఉంద‌ని, ఆమెను సింహాలు కాపాల కాస్తున్నాయ‌ని చెప్పారు.

దాంతో షాక్ తిన్న పోలీసులు, అట‌వీ శాఖ అధికారులు ఘ‌ట‌న‌స్థ‌లానికి వెళ్లారు. అక్కడ తీవ్ర‌గాయాల‌తో షాక్‌కు గురైన చిన్నారిని అక్కున చేర్చుకొని అత్య‌వ‌స‌ర చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం స్పృహ‌లోకి వచ్చిన చిన్నారి అడ‌విలో జ‌రిగిన విష‌యాన్ని పూస‌గుచ్చిన‌ట్లు పోలీసుల‌కు చెప్పింది. దీంతో పోలీసులు సింహాల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కిడ్నాప్‌కు పాల్ప‌డిన నిందితుల్ని క‌ట‌క‌ట‌ల్లోకి నెట్టారు.  

సింహాలు బాలికను ర‌క్షించ‌క‌పోయి ఉంటే ప‌రిస్థితి దారుణంగా ఉండేద‌ని అట‌వీ శాఖ అధికారి వెండాజు  తెలిపారు. ఈ ప్రాంతంలో చిన్నారుల‌పై లైంగిక దాడులు ఎక్కువ‌గా జ‌రుగుతాయి. లైంగిక దాడుల అనంతరం బ‌ల‌వంతంగా పెళ్లిచేసుకుంటారు. ఒప్పుకోలేదంటే ప్రాణాలు తీసి పైశాచికానందం పొందుతార‌ని  ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

చదవండి: నెల రోజుల్లో భార్యకు 3 సార్లు విడాకులిచ్చి..

Advertisement
 
Advertisement
 
Advertisement