England Woman Takes Bath Only Once A Week Know The Reason - Sakshi
Sakshi News home page

వృత్తేమో టీచర్‌... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!!

Nov 30 2021 3:59 PM | Updated on Nov 30 2021 8:02 PM

This England Woman Takes Bath Only Once A Week Know The Reason - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఒక్కోసారి బద్దకంగా అనిపిస్తే ఆ రోజు స్నానాన్ని మరుసటి రోజుకు వాయిదా వేస్తాం! అసలు మొత్తానికే మానెయ్యలేం కదా..

శీతాకాలంలో స్నానం చేయాలంటే ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది. అందుకని స్నానం మానెయ్యలేం కదండి! చన్నీటికి కొంచెం వేడి నీళ్లు జోడించి ఎలాగోలా స్నానం కానిస్తాం.. ఐతే ఓ యువతికి అసలు స్నానం చేయడమే ఇష్టం ఉండదట. వారానికోసారి మాత్రమే చేస్తుందట. స్కూల్‌ విద్యార్ధులకు మంచి అలవాట్ల గురించి నేర్పించవల్సిన టీచర్‌ ఆమె. ఇంత బాధ్యతాయుతమైన వృత్తిలో పనిచేస్తూ కూడా అపరిశుభ్రతను పాటించడం వెనుక కారణం ఏమిటో.. ఎందుకో.. తెలుసుకుందాం..

ఇంగ్లాండ్‌కు చెందిన నటాలీ కింగ్‌ (49) అనే యువతి వృత్తిరిత్యా టీచర్‌. ఆమె భర్త జమీ ప్లంబర్‌. ఒక నివేదిక ప్రకారం సదరు మహిళ వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని, కనీసం శరీరం నుంచి దుర్గంధం రాకుండా డియోడరెంట్‌లను కూడా కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తుందని పేర్కొంది. ఇక ఆమె శరీరం నుంచి ఏ స్థాయిలో చెడు వాసన వస్తుందో ఊహించండి. అంతేకాదు ఆమె భర్త జమీ, భార్య ప్రతిరోజూ స్నానం చెయ్యాలని బాత్‌రూమ్‌ను కూడా అందంగా డిజైన్‌ చేయించాడట కూడా. 

అయినప్పటికీ ఆమె స్నానం చెయ్యడానికి ఆసక్తి చూపడం లేదు. దుస్తులకు పర్ఫ్యూమ్‌ కొట్టుకుని రోజువారి పనులు చేసుంటుంది. కానీ ఏ రోజు కూడా భార్యని స్నానం చెయ్యవల్సిందిగా ఒత్తిడి మాత్రం చెయ్యలేదు సదరు భర్తగారు. ఎంత విచిత్రమైన బంధమో వీళ్లది కదా!

చదవండి: Senior Citizen Savings Scheme: బంపరాఫర్‌ ! పోస్టాఫీస్‌లో వెయ్యితో ఖాతా తెరిస్తే ఐదేళ్లలో రూ.14 లక్షలు!! పూర్తి వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement