వైరల్‌: టూర్‌ బోటుతో 400 డాల్ఫిన్ల పోటీ.. 95 మిలియన్ల వ్యూస్‌!

Dolphins Stampeding Alongside Boat Which Is Viral Shared By Harsh Goenka - Sakshi

వాషింగ్టన్‌: నీటిలో ఉండేవన్నీ చేపలు కాదు. నీటిలో క్షీరదాలుకూడా ఉంటాయి. తిమింగలాలు, డాల్ఫిన్లు, పోర్పోయిస్‌ నీటిలో నివసిస్తాయి. కానీ అవి సెటాసియన్స్‌ (సెహ్‌-టే-షున్స్‌) అని పిలిచే నీటిలో ఉండే క్షీరదాలు. అయితే  సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు తెలిగలవిగా పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. డాల్ఫిన్లు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లోతులలో డైవింగ్ చేయగలవు.

టూర్‌ బోటుతో పోటీ
తాజాగా  ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా ట్విటర్‌ ద్వారా ఓ టూర్‌ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్‌ బీచ్‌ తీరంలో తీశారు. దీన్ని డాల్ఫిన్ టూర్ క్రూయిజ్‌లను అందించే న్యూపోర్ట్‌ వేల్‌ అనే సంస్థ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా.. హర్ష్‌ గోయెంకా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆయన షేర్‌ చేసిన వీడియోను 84.6 వేల మంది నెటిజన్లు వీక్షించగా.. దీని న్యూపోర్ట్‌ వేల్స్‌ షేర్‌ చేసిన వీడియోను 95 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు.  46 సెకన్ల నిడివి గల వీడియోలో..  టూర్ బోటుతో సుమారు 400 డాల్ఫిన్లు డైవ్‌ చేస్తూ పోటీ పడ్డాయి. దీన్ని బోటులో ఉన్న వారు ఎగబడి మరీ చూశారు. తమ సెల్‌ ఫోన్‌ కెమెరాల్లో బంధిస్తూ.. తెగ ఎంజాయ్‌ చేశారు. ఈ దృష్యం చాలా అందంగా ఉంది. నిజంగా ఇది చూడటం ఓ అదృష్టం అంటూ కామెంట్‌ చేశారు. ‘‘సముద్రంలో డాల్పిన్ల పోటీ.. మరి గెలుపెవరిది.’’ అంటూ రాసుకొచ్చారు.

ఆక్సిజన్‌ను గ్రహించలేని జలచరాలు
ఇక నీటిలోనే ఉన్నప్పటికీ నీటిలోని ఆక్సిజన్‌ను గ్రహించలేని జలచరాలు నీటి పాములు, తాబేళ్లు, మొసళ్లు, సీల్స్‌, డాల్ఫిన్లు, తిమింగలాలు. ఈ జీవులకు మొప్పలు ఉండవు. చర్మపు నిర్మాణం కూడా నీటిలోని ఆక్సిజన్‌ను తీసుకోగల స్థితిలో ఉండదు. గాలిలోని ఆక్సిజన్‌ను ఊపిరి ద్వారా గ్రహించగలిగే శ్వాస వ్యవస్థ (పల్మనరీ శ్వాసక్రియ) మాత్రమే వీటిలో ఉంటుంది. అందువల్లనే ఇలాంటివి సముద్రంలోనే ఉన్నా పదేపదే నీటి ఉపరితలం పైకి వచ్చి గాలిని వదిలి, కావలసినంత గాలిని పీల్చుకుని తిరిగి నీటిలోకి వెళ్లిపోతూ ఉంటాయి.
 

చదవండి:
టీకాకు భయపడి.. భార్య ఆధార్‌తో రోజంతా చెట్టుపైనే.. 
ఈ ఫోటోలో మరో చిరుత కూడా ఉందండోయ్‌.. గుర్తుపట్టారా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top