వైరల్‌: టీవీలో సీన్‌ చూసిన పిల్లి పరుగో.. పరుగు..!

A Cat Reaction To Tom And Jerry Episode Went Viral In Social Media - Sakshi

Cat Funny Videos: టామ్‌ అండ్‌ జెర్రీ ఎపిసోడ్‌ సిరీస్‌ ఇష్టపడని వారుండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో సమయంలో దానికి కనెక్ట్‌ అయ్యే ఉంటారు. అయితే తాగాజా టామ్‌ అండ్‌ జెర్రీ ఎసిసోడ్‌లోని ఓ సీను చూసిన పిల్లి భయంతో పరుగు లంకించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ పెంపెడు పల్లి టామ్‌ అండ్‌ జెర్రీలోని సీన్‌ చూస్తుంది. దానిలో జెర్రీ నెత్తిపైన టామ్‌ ఓ మొట్టికాయ కొడుతుంది. దీంతో జెర్రీ చేయిని పెద్దగా చేసి టామ్‌ను ఓ గుద్దు గుద్దుతుంది. అంతే టామ్‌ ఎక్కడో పడుతుంది.

అయితే టామ్‌ కొట్టినప్పుడు ఆసక్తిగా ముందుకు వచ్చి చూసిన పిల్లి.. టామ్‌ని జెర్రీ కొట్టగానే తర్రున భయంతో పారిపోతుంది. ఈ వీడియో మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. 1.2 మిలియన్లకు పైగా నెటిజనులు వీక్షించారు. వేల మంది లైక్‌ కొట్టి, కామెంట్‌ చేస్తున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ ఇది ఓ ఎడిట్‌ చేసిన వీడియో. అక్కడ నిజంగా పిల్లి  ఉండటంతో భయపడి పారిపోయింది.’’ అంటూ కామెంట్‌ చేశాడు. మరో నెటిజన్‌ ‘‘ ఏమైనప్పటికీ ఈ వీడియోను చూసిన వెంటనే.. నా పెదవులపై చిరునవ్వును చిందించాయి.’’ అంటూ రాసుకొచ్చారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top