
వాటికన్ సిటీ: ఓ వ్యక్తి వీర్య దానం పదిమంది పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. జన్యు పరివర్తన కారణంగా సదరు వ్యక్తి దానం చేసిన వీర్యం వల్ల 65 మంది పిల్లల్లో పది మంది పిల్లలకు క్యాన్సర్ సోకింది.
ఓ వ్యక్తి 2008 నుండి 2015 మధ్య ఐరోపాలోని ఎనిమిది దేశాలకు వీర్య దానం చేశారు. అతని స్పెర్మ్ ద్వారా 67 మంది పిల్లలు పుట్టారు. అయితే, కొంత కాలానికి ఆ వ్యక్తిలో అరుదైన క్యాన్సర్ కలిగించే జన్యు మ్యూటేషన్ ఉన్నట్టు గుర్తించారు. ఫలితంగా వీరిలో ఇప్పటివరకు 10 మంది పిల్లలకు క్యాన్సర్ సోకినట్లు తేలింది.
వీర్య దానంతో 67మంది పిల్లల్లో 23 మందికి టీపీ53 అనే జన్యు మ్యూటేషన్ ఉందని గుర్తించారు. ఈ జన్యు మ్యూటేషన్ ఉన్నవారికి జీవితకాలంలో ల్యూకేమియా, నాన్-హాడ్జ్కిన్ లింఫోమా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని ముందుగా రెండు కుటుంబాలు తమ పిల్లల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యుల్ని సంప్రదించారు. వైద్యుల సలహా మేరకు ఫెర్టిలిటీ క్లినిక్స్‌ను సంప్రదించాయి. విచారణలో యూరోపిన్ స్పెర్మ్ బ్యాంక్ డోనర్ ద్వారా వచ్చిన శాంపిళ్లలో టీపీ53 మ్యూటేషన్ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
2008లో డొనేషన్ జరిగిన సమయంలో ఈ మ్యూటేషన్ క్యాన్సర్ కలిగించేది అన్న విషయం వెలుగులోకి రాలేదు. కారణం సాధారణ స్క్రీనింగ్ ద్వారా ఇది గుర్తించేది కాదు. ఈ మ్యూటేషన్ ఉన్న పిల్లలు ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నారు. ఫుల్ బాడీ ఎంఆర్ఐ స్కాన్లు, మెదడు, ఛాతీ స్కాన్లు, అలాగే కడుపు అల్ట్రాసౌండ్లు తీస్తున్నారు.