రిషి సునాక్‌పై తీవ్ర విమర్శలు చేసిన బ్రిటన్ ఎంపీ   | Conservative UK Lawmaker Quits With Scathing Attack On PM Sunak | Sakshi
Sakshi News home page

రాజీనామా లేఖలో రిషి సునాక్‌పై తీవ్ర విమర్శలు చేసిన బ్రిటన్ ఎంపీ

Published Sun, Aug 27 2023 5:28 PM | Last Updated on Sun, Aug 27 2023 5:55 PM

Conservative UK Lawmaker Quits With Scathing Attack On PM Sunak - Sakshi

లండన్: బ్రిటిష్ మాజీ కల్చర్ సెక్రెటరీ నాడైన్ డోరీస్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో ప్రధాని రిషి సునాక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా చేసినప్పుడే ఆమె కూడా రాజీనామా చేయాల్సి ఉంది కానీ అప్పుడు ఆమె రాజీనామా చేయనందుకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రాజీనామా చేసిన ఆమె రిషి సునాక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ భారీ లేఖను రాశారు. 

బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యంత సన్నిహితురాలైన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ నాడైన్ డోరీస్ చాలా కాలంగా రిషి సునాక్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రధాని జాంబీల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయనకు ఎటువంటి రాజకీయ ముందుచూపు లేదన్నారు. రిషి సునాక్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. 

ఆర్ధిక పరమైన కుంభకోణాలతో పాటు మరికొన్ని కుంభకోణాల కారణంగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి నుండి తప్పుకున్నారు. మాజీ ఆర్ధిక మంత్రి, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన రిషి సునాక్ పార్టీ నాయకత్వ పోటీలో నామినేట్ చేయబడిన ఏకైక అభ్యర్థి కావడంతో ప్రధానిగా నియమితులయ్యారు. 

ఎంపీ రాసిన రాజీనామా లేఖ సంగతి అటుంచితే రిషి సునాక్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే వెంటిలేటర్‌పైనే ఉండాలి చెప్పాలి. కొద్దీ రోజుల క్రితం ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ రెండు స్థానాలను కోల్పోగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన చోట మాత్రం గెలిచింది. ప్రధాని రిషి సునక్ తన సాంకేతిక నాయకత్వాన్ని ఉపయోగించుకుని పార్టీ విశ్వసనీయతను కాపాడుకంటూ వస్తున్నారు. కానీ అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక స్తబ్దత, పారిశ్రామిక అస్థిరత ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో జాప్యం వంటి కారణాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ కారణాల వల్లనే వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థి లేబర్‌ పార్టీ కంటే చాలా వెనుకబడి ఉన్నారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement