అట్లుంటది మన యాక్టింగ్‌.. పోలా అదిరిపోలా!

Comedy Wildlife Photography Awards 2022: Funny Winning Images - Sakshi

ఈ కోతికి కొంచెం యాక్టింగ్‌ పిచ్చి.. ఎప్పటికైనా సినిమాల్లో స్టార్‌ అయిపోవాలని కలలుగంటోంది..పైగా.. చావు సీన్లలో యాక్ట్‌ చేయడంలో స్పెషలైజేషన్‌ కూడా ఉంది. ఎంతలా అంటే యాక్టింగా.. లేక నిజంగానే చచ్చిందా అన్నది సాటి కోతు­లు కూడా కనిపెట్టలేవు. ఫొటోగ్రాఫర్‌ ఫెడ్రికా(ఇటలీ) కూడా చని­పోయిం­దనే అనుకు­న్నారు. ఇంతలో ఎవరు కట్‌ అన్నారో తెలియదుగానీ.. చటుక్కున లేచి కూర్చుందట. కామెడీ వైల్డ్‌ లైఫ్‌ అవార్డ్స్‌ జ్యూరీ మెచ్చిన చిత్రమిది.  

ఇట్స్‌ ఏ గోల్‌..
ఈ గద్ద.. మెస్సీ ఫ్యాన్‌ అట. ఈ మధ్యే ఫిఫా వరల్డ్‌ కప్‌ చూసొచ్చింది. అప్పటి నుంచీ ఇదే వరుస. గోల్‌ మీద గోల్‌ కొట్టేస్తోంది. ఏమో.. ఎప్పుడైనా తమ గద్దల్లోనూ ఫుట్‌ బాల్‌ పోటీపెడితే.. పనికివస్తుందని ఇప్పటి నుంచే తెగ ప్రాక్టీస్‌ చేస్తోంది. జియా చెన్‌ తీసిన ఈ చిత్రం కామెడీ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ పోటీల్లో అమేజింగ్‌ ఇంటర్నెట్‌ పోర్ట్‌ఫోలియో పురస్కారాన్ని గెలుచుకుంది. 
 సాక్షి సెంట్రల్‌డెస్క్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top